మాట మార్చిన పాకిస్థాన్‌.. ఎంట్రీ ఫీజు చెల్లించాల్సిందే..

Fri,November 8, 2019 03:33 PM

న్యూఢిల్లీ : గురు నానక్‌ 550వ జయంతి సందర్భంగా ఈ నెల 9వ తేదీన కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అయితే కర్తార్‌పూర్‌ కారిడార్‌ మీదుగా పాకిస్థాన్‌లోకి తొలి రోజు వచ్చే యాత్రికులకు ఎలాంటి ప్రవేశ రుసుం వసూలు చేయబోమని పాకిస్థాన్‌ నవంబర్‌ 1వ తేదీన ప్రకటించింది. ఈ విషయంలో పాకిస్థాన్‌ మాట మార్చింది. కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవం రోజున ఒక్కొక్కరికి 20 డాలర్ల చొప్పున ప్రవేశ రుసుం వసూలు చేస్తామని పాక్‌ స్పష్టం చేసింది.


గురునానక్ 550వ జన్మదినోత్సవం సందర్భంగా సంవత్సర కాలంపాటు భారత సిక్కు యాత్రికులు పాస్‌పోర్టు లేకుండానే కర్తార్‌పూర్‌ను సందర్శించవచ్చు. అలాగే, కర్తార్‌పూర్‌కు వచ్చే భారత యాత్రికుల వివరాల్ని 10 రోజుల ముందుగానే మాకు భారత్ తెలియజేయాలన్న నిబంధనను కూడా సడలిస్తున్నాం. దీంతోపాటు నవంబర్ 9, 12 తేదీల్లో కర్తార్‌పూర్ సందర్శనకు భారత యాత్రికులు చెల్లించాల్సిన 20 డాలర్ల ఫీజును కూడా వసూలు చేయం అని పాక్ విదేశీ కార్యాలయం ప్రతినిధి మహమ్మద్ ఫైజల్ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక్క రోజులోనే పాకిస్థాన్ మాట మార్చడంతో పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి భారత్ నుంచి 550 మంది ప్రముఖులు హాజరు కానున్నారు.

సిక్కుల మ‌త గురువు గురు నాన‌క్‌కు చెందిన గురుద్వారా ద‌ర్బార్ సాహిబా ప్ర‌స్తుతం పాకిస్థాన్‌లో ఉన్న‌ది. అయితే ప్ర‌తి రోజూ 5 వేల మంది సిక్కులు ఆ గురుద్వార్ వ వెళ్లేందుకు పాకిస్థాన్ అనుమ‌తి ఇచ్చింది. గురు నాన‌క్ త‌న చివ‌రి 18 ఏళ్ల జీవితాన్ని గురుద్వారా ద‌ర్బార్ సాహిబ్‌లోనే గ‌డిపారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న న‌రోవ‌ల్ జిల్లాలో ఈ గురుద్వారా ఉన్న‌ది. ఇది అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుకు కేవ‌లం నాలుగు కిలోమీట‌ర్ల దూరంలో ఉంది.

1380
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles