రిచ్ పెండ్లికొడుకు.. ఒళ్లంతా బంగారమే.. వీడియోSun,April 15, 2018 03:43 PM

Pakistan bridegroom wears gold shoe and crystal tie worth 25 lakhs for his wedding

చాలా మంది తమ పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలనుకుంటారు. ఊరు ఊరంతా తమ పెండ్లి గురించి మాట్లాడుకోవాలనుకుంటారు. దాని కోసం ఎంతకైనా తెగిస్తారు. ఏదైనా చేస్తారు. కాని.. అది జరగాలంటే వాళ్లు రిచ్ అయి ఉండాలి. డబ్బుల్లేకుండా ఏం చేయలేం కదా. అందుకే.. జీవితాంతం గుర్తుండేలా, వినూత్నంగా తమ పెండ్లి జరగాలనుకుంటారు.

అలా.. కొన్ని పెళ్లిళ్లు జరగడం కూడా మనం చూశాం. ఇప్పుడు మీరు చూడబోయేది పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన ఓ బిజినెస్‌మెన్ పెండ్లి వీడియో. తన పెండ్లి స్పెషల్‌గా ఉండాలని ఏం చేశాడో తెలిస్తే మీరు నోరెళ్లబెట్టాల్సిందే. అవును మరి.. ఎవరైనా పెండ్లికి ఓ రింగో లేదంటే చైనో చేయించుకుంటారు. మరీ అంత బంగారం అంటే పిచ్చి ఉంటే ఓ బ్రాస్‌లెట్ చేయించుకుంటారు. కాని.. ఈ బిజినెస్‌మెన్ కమ్ పెండ్లి కొడుకు ఏకంగా బంగారం సూట్, బంగారం షూ, బంగారం టై చేయించుకున్నాడు. షాక్ అయ్యారా? చెప్పాను కదా.. మీరు షాక్ అవుతారని.. మొత్తం 25 లక్షల పాకిస్తానీ రూపాయలు పెట్టి మరీ వీటిని చేయించుకున్నాడు.


వీటిని తన రిసెప్షన్‌లో ధరించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. అంతే కాదు.. పెండ్లికి వచ్చిన బంధువులు, మిత్రులంతా ఆ రిచ్ పెండ్లికొడుకును తమ కెమెరాలతో క్లిక్‌మనిపించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ రిచ్ పెండ్లికొడుకు కాస్త... సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు. మీడియా కూడా వెంటనే మనోడి రిసెప్షన్‌కు వెళ్లి రిచ్ పెండ్లి కొడుకు ఇంటర్వ్యూ కూడా తీసేసుకుంది. మొత్తానికి కొత్తగా ఆలోచించి భలే ఫేమస్ అయిపోయాడుపో.


6565
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS