మసూద్, సయీద్.. మీకోసం వెతుకుతున్నారు.. బయటకు రాకండి!

Wed,February 20, 2019 02:45 PM

Pakistan Army tells Masood Azhar and Hafiz Saeed not to come out for some time

న్యూఢిల్లీ: పాకిస్థాన్ రెండు నాల్కల ధోరణి మరోసారి బయటపడింది. ఓవైపు పుల్వామా దాడితో తమకేం సంబంధం అని ప్రశ్నించారు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. మరోవైపు ఈ దాడికి కారణమైన జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను బయటకు రావద్దంటూ సూచించింది పాకిస్థాన్ ఆర్మీ. అంతర్జాతీయంగా పుల్వామా దాడిపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయని, పరిస్థితులు కుదుటపడే వరకు బయటకు రావద్దు అని ఈ దాడి సూత్రధారి మసూద్ అజర్, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌లకు పాక్ ఆర్మీ చెప్పడం గమనార్హం. ఈ నెల 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేసి 40 మందికిపైగా జవాన్లను పొట్టన బెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ దాడి తమ పనే అని జైషే మహ్మద్ ప్రకటించుకుంది.

అయినా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ మాత్రం తమకేం సంబంధం లేదన్నట్లు మాట్లాడారు. ఆధారాలు ఉంటే ఇవ్వండి చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు ఆ దేశ ఆర్మీయే ఆ ఉగ్రవాదులకు రక్షణగా నిలుస్తున్నది. పైగా ఈ దాడిలో ఉపయోగించిన ఆర్డీఎక్స్‌ను పాకిస్థాన్ ఆర్మీయే రావల్పిండి నుంచి సేకరించి జైషే ఉగ్రవాదులకు అందించినట్లు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. గతేడాది మార్చి నుంచే ఈ ఆర్డీఎక్స్ సేకరణ ప్రారంభమైందని, పేలుడు పదార్థాలను బ్యాగులు, సిలిండర్లు, బొగ్గు బ్యాగుల్లో పుల్వామాలోని ట్రాల్ గ్రామానికి తరలించినట్లు చెప్పాయి. ఈ దాడిలో 80 కిలోల ఆర్డీఎక్స్ ఉపయోగించారు.

7453
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles