పాక్ ఆర్మీ చీఫ్‌ ప‌ద‌వీకాలం పొడిగింపు..

Mon,August 19, 2019 05:37 PM

Pakistan Army chief General Bajwas tenure extended for another 3 years

హైద‌రాబాద్‌: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ఖ‌మ‌ర్ జావెద్ బాజ్వా ప‌ద‌వీకాలాన్ని పొడ‌గించారు. ఆ దేశ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌రో మూడేళ్ల పాటు ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ బాజ్వా ప‌ద‌వీకాలాన్ని పొడిగిస్తున్న‌ట్లు పీఎంవో కార్యాల‌యంలో ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. ప్రాంతీయ భ‌ద్ర‌తా వాత‌వ‌ర‌ణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పీఎంవో వెల్ల‌డించింది. పీఎంవో రిలీజైన్ చేసిన నొటిఫికేష‌న్‌పై ఇమ్రాన్ ఖాన్ సంత‌కం చేశారు. 2016 న‌వంబ‌ర్‌లో మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్‌.. జ‌న‌ర‌ల్ బాజ్వాను ఆర్మీ చీఫ్‌గా నియ‌మించారు.

986
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles