లిమో ప్రమాదం.. పాక్ సంతతి వ్యక్తిపై అమెరికాలో కేసు

Fri,October 12, 2018 06:55 PM

pak-origin operator arrested in limo accident case

ఇటీవల 20 మందిని బలిగొన్న లిమొజిన్ ప్రమాదం కేసులో పాక్ సంతతికి చెందిన నౌమాన్ హుసేన్‌పై అమెరికా అధికారులు కేసుపెట్టారు. నిర్లక్ష్యంతో అంతమంది మరణానికి కారకుడయ్యాడనేది ప్రధానమైన ఆరోపణ. ఇటీవల న్యూయార్క్ రాష్ట్రంలో పార్టీకి పెద్ద లిమోకారులో పార్టీకి వెళ్లున్న 17 మంది, దాని డ్రైవరు, ఇద్దరు పాదచారులు మరణించిన సంగతి తెలిసిందే. ప్రెస్టీజ్ లిమొజిన్ కంపెనీ ఆ వాహనాన్ని అద్దెకు ఇచ్చింది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న అతని తండ్రి కంపెనీ యజమాని. నౌమాన్ టూర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆ కారును రోడ్డు మీదకు తెచ్చేందుకు అనుమతి లేదు. ఎందుకంటే దాని పరిస్థితి బాగాలేదు. రిపేర్లు చేయించమని అధికారులు నోటీసులు పంపినా చేయించలేదు. పైగా ప్రమాదంలో చనిపోయిన డ్రైవరుకు ఆ కారు నడిపే అర్హత లేదు. గత బుధవారం నౌమాన్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్టు న్యూయార్క్ పోలీసులు తెలిపారు. కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది.

1274
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS