భారీకాయుడిని మిలటరీ హెలికాప్టర్‌లో ఆస్పత్రికి..

Wed,June 19, 2019 04:58 PM

Pak heaviest man shifted to lahore hospital for treatment


లాహోర్: పాక్‌లోనే అత్యంత భారీకాయుడుగా పేరొందిన నూర్ హస్సన్‌ను చికిత్స నిమిత్తం అధికారులు ఆస్పత్రికి తరలించారు. సాదికాబాద్ జిల్లాలోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన నూర్ హస్సన్ 330 కిలోల బరువున్నాడు. అధిక బరువు కారణంగా నూర్‌హస్సన్ కదల్లేని స్థితిలో ఉండిపోయాడు. దీంతో ఆయనకు వివిధ ఆరోగ్యసమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నూర్ హస్సన్ కుటుంబసభ్యులు అధికారులను సంప్రదించారు.

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావెద్ బజ్వా నూర్ హస్సన్‌ను ఆస్పత్రికి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లను చేశారు. ఆర్మీ రెస్క్యూ టీం, స్థానికులు నూర్ హస్సన్‌ను అతని ఇంట్లో నుంచి అతి కష్టం మీద బయటకు తీసుకువచ్చారు. భారీశరీరం కావడంతో బయటకు తీసుకువచ్చేటపుడు నూర్‌హస్సన్ ఇంటి బయట ఉన్న గోడను కూలగొట్టారు. ప్రత్యేక మిలిటరీ హెలికాప్టర్‌లో నూర్‌హస్సన్‌ను లాహోర్‌లోని ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో వైద్య నిపుణుల బృందం నూర్ హస్సన్‌కు లాప్రొస్కోపిక్ సర్జరీతోపాటు ఇతర చికిత్సలను చేయనున్నారు. పాక్‌లో ప్రస్తుతం 330 కిలోల బరువుతో..అత్యంత స్థూలకాయుడిగా నూర్‌హస్సన్ పేరు నమోదైందని అధికారులు తెలిపారు. అయితే దీనిపై అధికారిక సమాచారం మాత్రం తెలపలేదు.

3212
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles