పాక్ భారీకాయుడు నూరుల్ హసన్ మృతి

Mon,July 8, 2019 09:15 PM

Pak Heaviest Man Noorulhasan Dies in clashes

పాక్ లోనే అత్యంత భారీకాయుడిగా పేరున్న నూరుల్ హసన్ చనిపోయాడు. 330 కిలోల బరువున్న నూరుల్ హసన్ కు లాహోర్ లో ప్రత్యేకవైద్యనిపుణుల బృందం ఆపరేషన్ పూర్తి చేసింది. ఆపరేషన్ తర్వాత నూరుల్ హాసన్ ను వైద్యులు ఐసీయూకు మార్చారు.

నూరుల్ హసన్ పరిస్థితి దృష్ట్యా అతనికి ఎక్కువ మంది వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి అయింది. డాక్టర్లు లేకపోవడం వల్ల అదే ఆస్పత్రిలో చేరిన ఓ మహిళ సరైన వైద్యం అందక చనిపోయింది. దీంతో ఆ మహిళ కుటుంబసభ్యులు ఆస్పత్రిలోని ఐసీయూలోకి చొచ్చుకువెళ్లి ఆందోళనకు దిగారు. ఐసీయూ కిటికీ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఐసీయూలో ఉన్న నర్సులు, డాక్టర్లు భయంతో బయటకు పరుగులు తీశారు. ఘర్షణ నేపథ్యంలో నూరుల్ హసన్ కు సరైన పర్యవేక్షణ లేక అతడు ప్రాణాలు కోల్పోయాడు.

సాదిక్ బాద్ కు చెందిన నూరుల్ 330 కిలోల బరువుండటంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. కుటుంబసభ్యుల విజ్ఞప్తి మేరకు ఆర్మీ అధికారుల బృందం అతన్ని జూన్ 28న ఆపరేషన్ కోసమని ప్రత్యేక హెలికాప్టర్ లో లాహోర్ ఆస్పత్రికి తరలించింది.

4528
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles