సింహాలు వెళ్తుంటే.. స్తంభించిన ట్రాఫిక్.. వీడియో

Fri,January 11, 2019 05:08 PM

అడవికి రారాజులైన మృగరాజులను చూస్తే అటు జంతువులు, ఇటు మనషులు వణికిపోతారు. ఓ నాలుగు సింహాలు ప్రధాన రహదారిపై ఠీవీగా నడుచుకుంటూ వెళ్తుంటే వాహనాలన్నీ ఆగిపోయాయి. ఆ సింహాలు దర్జాగా రోడ్డుపై వెళ్తుంటే.. కార్లలో ఉన్న వ్యక్తులు అలా కళ్లార్పకుండా చూశారు. కొందరైతే తమ మొబైల్స్ లో చిత్రీకరించారు. ఈ సంఘటన దక్షిణాఫ్రికాలోని క్రుగేర్ నేషనల్ పార్క్ లోని రహదారిపై చోటు చేసుకుంది. సింహాల సఫారీకి ఈ పార్క్ ఎంతో ఫేమస్. అయితే సింహాల సఫారీ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. 10వేల మందికి పైగా ఈ వీడియోను షేర్ చేశారు.5645
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles