సంవత్సరం పిల్లాడు.. నెయిల్ కట్టర్‌ను మింగేశాడు!

Mon,April 23, 2018 02:46 PM

One year old boy swallowed a nail clipper in china

అది చైనాలోని చాంగ్‌చున్. ఓ సంవత్సరం పిల్లాడు ఇంట్లో ఉన్న నెయిల్ కట్టర్‌తో ఆడుకుంటున్నాడు. దానితో కొంత సేపు అటూ ఇటూ ఆడి ఆ తర్వాత దాన్ని మింగేశాడు. అది అలాగే కడుపులోకి వెళ్లిపోయింది. అంతే.. వెంటనే ఆ పిల్లాడిని చాంగ్‌చున్‌లోని పిల్లల ఆసుపత్రికి తరలించారు. సుమారు 2.4 ఇంచులు ఉన్న నెయిల్ కట్టర్‌ను పిల్లాడి కడుపులో నుంచి ఆపరేషన్ చేసి బయటికి తీశారు డాక్టర్లు. దీంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఇదే చైనాలో ఓ వ్యక్తి కడుపులో నుంచి డాక్టర్లు లైటర్‌ను బయటికి తీశారు. ఆ లైటర్‌ను ఆ వ్యక్తి 20 ఏండ్ల కింద మింగడం కొసమెరుపు.

4155
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles