సాహిత్యంలో ఓల్గా, పీటర్ కు నోబెల్ పురస్కారం

Thu,October 10, 2019 07:19 PM


స్వీడిష్ అకాడమీ సాహిత్యంలో నోబెల్ పురస్కార విజేతలను ప్రకటించింది. ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారానికి 2018, 2019 సంవత్సరాలకు ఇద్దరు ఐరోపా రచయితలు ఎంపికయ్యారు. 2018 సంవత్సరానికి సాహిత్యంలో పోలండ్ రచయిత్రి ఓల్గా టోకర్ జుక్ నోబెల్ పురస్కారానికి ఎంపికవగా..2019కి గాను సాహిత్యంలో ఆస్ట్రియన్ రచయిత పీటర్ హ్యాండ్ కే నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు.


సాహిత్యం విభాగంలో అవార్డులను ప్రదానం చేసే స్వీడిష్ అకాడమీని స్వీడిష్ ఫొటోగ్రాఫర్ జీన్ క్లౌడే అర్నాల్ట్ నిర్వహిస్తున్నాడు. అర్నాల్ట్ పై డజన్ మందికిపైగా మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దీంతో అది కాస్తా మీటూ ఉద్యమానికి దారితీయడంతో.. గతేడాది నోబెల్ బహుమతుల ప్రకటన వాయిదా పడింది. ఇదే కేసులో అర్నాల్ట్ కు రెండేళ్ల జైలు శిక్ష కూడా పడ్డది. తాజాగా 2018తోపాటు 2019 విజేతను కూడా ప్రకటించారు.

932
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles