ఉత్తుత్తి నాగు పామును చూసే దడుసుకున్నారు.. వైరల్ ఫోటో

Wed,April 25, 2018 04:16 PM

Officers Get Called For Deadly Rattlesnake but it Was A Toy Cobra

అది యూఎస్‌ఏలో కాలిఫోర్నియా. ఓ ఇంటి యజమాని యానిమల్ కంట్రోల్ ఆఫీసర్స్‌కు ఫోన్ చేశాడు. తన ఇంటి వెనక ఓ తాచు పాము చనిపోయి ఉందని.. అది గత కొన్ని రోజులుగా కదలడం లేదని చెప్పాడు. దాన్నే రాటిల్ స్నేక్ అని అంటారు. ఇది చాలా విషపూరితమైన పాము. అవి కరిస్తే.. చావును పలకరించాల్సిందే. అంత డేంజర్ పాములు అవి.

దీంతో.. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది.. చనిపోయిందనుకున్న పామును అక్కడి నుంచి తీసేయడానికి ప్రయత్నించారు. దాన్ని ముట్టుకొని చూడగా.. అది ఉత్తుత్తి పాము అని తేలిపోయింది. అది రబ్బర్ కోబ్రా అని అది నిజమైన పాము కాదని వాళ్లు యజమానికి చెప్పారు.అయితే.. అది చాలా రోజుల నుంచి అక్కడే ఉందని.. అది కదలకుండా అలాగే ఉండేసరికి ఆ పాము చనిపోయిందేమోనని అనుకున్నానని కాని.. అది విషపూరితమైన పాము అయ్యేసరికి దాని దగ్గరికి వెళ్లడానికి సాహసించలేదని యజమాని తెలిపాడు.

సాధారణంగా చనిపోయిన పాముల అవశేషాలను తీసుకెళ్లాలనే కాల్స్ రావడం చాలా అరుదు. అని యానిమల్ కంట్రోల్ ఆఫీసర్స్‌లో ఒకరు చెప్పారు. అయితే.. ఇలా బొమ్మ జంతువులను చూసి దడుసుకోవడం, భయపడటం ఇదే మొదటిసారేమీ కాదు. ఇదివరకు ఇలాగే స్కాట్లాండ్ లో బొమ్మ పులిని చూసి నిజం పులి అనుకొని ఆ ప్రాంత వాసులంతా భయాందోళనకు గురయిన సంగతి తెలిసిందే.

4459
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS

Namasthe Telangana Property Show

Featured Articles