ఆక్టోపస్‌లు కూడా ఇండ్లు కట్టుకుంటాయట..!

Thu,September 21, 2017 08:29 AM

Octopus also make homes harden

మెల్‌బోర్న్: మనం కట్టుకున్నట్టే.. సముద్రంలో నివసించే ఆక్టోపస్‌లు కూడా ఇండ్లు కట్టుకుంటాయట. అమెరికాకు చెందిన ఇల్లినాయిస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆస్ట్రేలియా తూర్పు తీర ప్రాంతంలో ఆక్టోపస్ నివాసాలను కనుగొన్నారు. దీనికి అక్ట్‌లాంటిస్ అని పేరుపెట్టారు. ఇది 18 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పుతో సముద్ర ఉపరితలానికి 10-15 మీటర్ల లోతులో ఉన్నదని పేర్కొన్నారు. గుళ్లలు, పెంకుల సహాయంతో ఆక్టోపస్‌లు దీంట్లో నివాసం ఏర్పరుచుకున్నాయని చెప్పారు. ఇందులో దాదాపు 13 ఆక్టోపస్‌లు స్థిర నివాసం ఏర్పరుచుకున్నాయని, మరో 10 ఆక్టోపస్‌లు అతిథులుగా వచ్చి వెళ్తున్నాయని గుర్తించామన్నారు. వివిధ భంగిమల్లోకి మారడం, రంగులు మార్చుకోవడం తదితర చర్యల ద్వారా ఒకదానితో ఒకటి సంభాషించుకుంటున్నాయని చెప్పారు. మొట్టమొదటిసారిగా 2009లో ఇదే ప్రాంతంలోని జేర్విస్ అఖాతంలో ఆక్టోపస్ డెన్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అప్పటి నుంచే ఆక్టోపస్‌లు ఒంటరిగా కాకుండా సమూహంగా నివసిస్తాయని గుర్తించారు. మరిన్ని పరిశోధనలు చేసి తాజాగా మరో నివాసాన్ని కనుగొన్నారు. ఇలా ఒకదాని పక్కన ఒకటి చొప్పున భారీ సంఖ్యలో నివాసాలు ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. అందుకే దీనికి అక్ట్‌లాంటిస్ సిటీ అని పేరుపెట్టారు.

1025
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles