కొత్త మున్సిపల్ చట్టంపై టీఆర్‌ఎస్ సెల్ బహరెన్ హర్షం

Fri,July 19, 2019 08:12 PM

NRI TRS Cell Bahrain Elation on new municipal law

కొత్త మున్సిపల్ చట్టంపై ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ బహరెన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ బహరేన్ అధ్యక్షుడు రాధారపు సతీశ్‌కుమార్ మాట్లాడుతూ... తెలంగాణ మున్సిపల్ చట్టం ద్వారా పాలనలో పారదర్శకత ఉంటుందన్నారు. అవినీతి నిర్మూలన, ప్రజలకు అందుబాటులోకి పాలన తీసుకురావడానికే సీఎం కేసీఆర్ నూతన మున్సిపల్ చట్టం తీసుకొచ్చారు. ఈ కొత్త మున్సిపల్ చట్టం సామాన్య ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చట్టాన్ని రూపొందించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు, పట్టణాలలో, పల్లెల్లోనూ గ్రీన్ కవర్‌పాలసీ, 75 గజాల లోపు ఇంటి నిర్మాణానికి రిజిస్టేషన్ ఫీజు ఒక్క రూపాయి. 75 గజాల లోపు నిర్మించుకున్న ఇంటికి పన్ను రూ.100, కార్యాలయానికి రాకుండానే 500 చదరపు మీటర్ల వరకు నిర్మాణాలకు అనుమతి వంటివి చరిత్రలో ఏ ప్రభుత్వాలు అందివ్వలేదన్నారు.

674
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles