వైట్‌హౌస్‌ వద్ద ఎన్నారై ఆత్మహత్య

Fri,May 31, 2019 02:39 PM

NRI suicide at white house in USA

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ సాక్షిగా ఎన్నారై యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అందరూ చూస్తుండగానే మంటల్లో కాలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. అక్కడి కాలమానం ప్రకారం మె 29 మధ్యాహ్నం 12.25గంటలకు ఈ ఘటనల చోటు చేసుకున్నట్లు చెప్పారు. మృతుడు భారత్‌కు చెందిన అర్నవ్‌గా గుర్తించారు.

మేరీల్యాండ్‌ ప్రాంతంలో నివసిస్తున్న అర్నవ్‌ ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్లాడని, తిరిగి ఇంటికి చేరుకోక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అతని కుంటుంబ సభ్యులు తెలిపారు. వైట్‌హౌస్‌ సమీపంలోని ఎలిప్స్‌ పార్క్‌ వద్ద అందరూ చూస్తుండగానే వంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. దీనిపై ఎలిప్స్‌పార్క్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అర్నవ్‌ ఆత్మహత్యకు గలకారాణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. వైట్‌హౌస్‌ వద్ద ఇలాంటి సంఘట జరగడం ఇది రెండోసారి. రెండు నెలల క్రితం ఇలాగే ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

2441
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles