నోబెల్‌ ప్రైజ్‌ పొందిన అభిజీత్‌ బెనర్జీ.. వివరాలు

Mon,October 14, 2019 11:47 PM

హైదరాబాద్‌: ఆర్థికశాస్త్రంలో భారత సంతతికి చెందిన అభిజీత్‌ బెనర్జీ నోబెల్‌ ప్రైజ్‌ పొందిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఆయన భార్య ఈస్తర్‌, మైఖేల్‌ క్రీమర్‌ సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. పేదరిక నిర్మూలనంపై వారు చేసిన పరిశోధనలకు గానూ వారికి నోబెల్‌ లభించింది. అభిజీత్‌కు సంబంధించిన వివరాలు.. అభిజీత్‌ ముంబయిలో జన్మించారు. ఉన్నత విద్యను ముంబయిలోనే పూర్తి చేసిన ఆయన వృత్తి రీత్యా అమెరికాకు వెళ్లారు. అక్కడే ఈస్తర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయన పరిశోధనలో ఆయన భార్య ఈస్తర్‌(ఆర్థికవేత్త) కూడా భాగమవడం విశేషం. ప్రస్తుతం ఆయన అమెరికాలోని ఎంఐటీలో ఎకనమిక్స్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఆమర్త్యసేన్‌ తర్వాత ఆర్థికరంగంలో నోబెల్‌ బహుమతి అందుకోనున్న రెండో బెంగాళీ అభిజీత్‌ బెనర్జీ.


ఈ సందర్భంగా నోబెల్ బహుమతి పొందిన అభిజీత్ ను భారతదేశానికి చెందిన పలువురు ప్రముఖులు అభినందించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆరుగురు భారతీయులు నోబెల్‌ బహుమతి అందుకోగా, వారిలో రబీంద్రనాథ్‌ ఠాగూర్‌, సీవీ రామన్‌, మదర్‌ థెరిసా, ఆమర్త్యసేన్‌, కైలాష్‌ సత్యార్థి ఉన్నారు.

765
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles