కొరియా ముప్పు తొలగింది.. ఇక హాయిగా నిద్రపోండి!

Wed,June 13, 2018 04:27 PM

No more threat from North Korea tweets Donald Trump after landing Washington

వాషింగ్టన్: నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌తో చారిత్రక భేటీ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్‌లో ల్యాండయ్యారు. ఇప్పుడే దిగాను.. చాలా లాంగ్ ట్రిప్.. కానీ నేను అధ్యక్ష పదవి చేపట్టనప్పటి కంటే ఇప్పుడు అందరూ హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. నార్త్ కొరియా నుంచి మనకు ఇక అణు ముప్పు లేదు. కిమ్ జాంగ్ ఉన్‌తో సమావేశం చాలా ఆసక్తిగా, సానుకూలంగా సాగింది. నార్త్ కొరియాకు మంచి భవిష్యత్తు ఉంది అని ట్రంప్ మొదట ట్వీట్ చేశారు. ఆ తర్వాత మరో ఐదు నిమిషాల వ్యవధిలో దీనికి సంబంధించే మరో ట్వీట్ చేశారు.


నేను అధ్యక్ష పదవి చేపట్టక ముందు చాలా మంది మనం ఉత్తర కొరియాతో యుద్ధం చేయబోతున్నామన్న భావనలో ఉన్నారు. నార్త్ కొరియానే మనకు అతిపెద్ద, ప్రమాదకర సమస్య అని అప్పటి అధ్యక్షుడు ఒబామా అన్నారు. కానీ ఇక అది ఏమాత్రం సమస్య కాదు. ఇక హాయిగా నిద్రపోవచ్చు అని ట్రంప్ అన్నారు.

2667
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS