బిక్షాటన చేసి టాయిలెట్ కట్టించుకొన్న మహిళTue,February 13, 2018 05:12 PM
బిక్షాటన చేసి టాయిలెట్ కట్టించుకొన్న మహిళ

పట్నా:మరుగుదొడ్డి నిర్మించుకోవడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారంలో ఉన్న రాజకీయ నేతలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇటీవలి కాలంలో పదేపదే చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం చేయడానికి అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఇలాంటి అనుభవమే బిహార్‌లోని ఓ పేద మహిళకు ఎదురైంది. మరుగుదొడ్డి మంజూరు కోసం కాళ్లరిగేలా తిరిగింది. అయినా ఫలితం లేకపోయింది. ఇక చేసేదేమి లేక చుట్టుపక్కల గ్రామాల్లో బిచ్చమెత్తుకొని మరీ టాయిలెట్‌ను నిర్మించుకొని ఆదర్శంగా నిలిచింది.


బిహార్‌లోని కోశీ ప్రాంత గ్రామమైన పాత్ర ఉత్తర్‌లో అమీనా ఖాతూన్ నివాసం ఉంటోంది. తన భర్త చనిపోవడంతో పూట గడవడం కోసం కూలీ పనులకు వెళ్తుండేది. ఆమెకు చిన్న బాలుడు కూడా ఉన్నాడు. మరుగుదొడ్డి నిర్మాణం కోసం బ్లాక్‌లెవల్ అధికారుల దగ్గరకు వెళ్లి నిధులు మంజూరు చేయాలని కోరగా వారెవరూ పట్టించుకోలేదు. ఎలాగైన టాయిలెట్ నిర్మించుకోవాలనే పట్టుదలతో సరిహద్దు గ్రామాల్లో బిక్షాటన చేసి డబ్బులు జమ చేసింది. వాటితో మరుగుదొడ్డిని కట్టుకుంది. ఐతే ఆమె పరిస్థితిని చూసి నిర్మాణ కార్మికులు డబ్బులు కూడా తీసుకోలేదు. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసి ఆమెను ఘనంగా సత్కరించారు. ఇప్పటికీ బిహార్‌లోని లక్షలాది ప్రజలు బహిరంగ మలవిసర్జనకు ఆసక్తి చూపించడం ఆందోళన కలిగించే విషయం. ఆ రాష్ట్రంలోని ఏ ఒక్క జిల్లా కూడా బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా గుర్తింపు సాధించలేదు.

1108
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Union Budget 2018