9 మంది ముస్లిం మంత్రులు రాజీనామా

Tue,June 4, 2019 09:51 AM

Nine Muslim Ministers and two Governors step down in Sri Lanka

హైద‌రాబాద్: శ్రీలంక‌లో తొమ్మిది మంది ముస్లిం మంత్రులు రాజీనామా చేశారు. అందులో న‌లుగురు క్యాబినెట్ హోదాలో ఉన్నారు. ఇటీవ‌ల శ్రీలంక‌లో ఈస్ట‌ర్ పండుగ వేళ ఆత్మాహుతి దాడులు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆ దాడుల్లో సుమారు 250 మంది వ‌ర‌కు మ‌ర‌ణించారు. అయితే ఆ దాడుల‌కు ముస్లింలే కార‌ణ‌మంటూ దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు మిన్నంటుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ముస్లిం మ‌తానికి చెందిన 9 మంది మంత్రులు, మ‌రో ఇద్ద‌రు గ‌వ‌ర్న‌ర్లు కూడా త‌మ ప‌ద‌వులకు రాజీనామా చేశారు. ముస్లింల‌ను అన్యాయంగా వేధిస్తున్నార‌ని ముస్లిం నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈస్ట‌ర్న్‌, వెస్ట‌ర్న్ ప్రావిన్సుల‌కు చెందిన గ‌వ‌ర్న‌ర్లు హిజ్‌బుల్లా, ఆజాత్ స‌ల్లేలు రాజీనామా చేశారు. మ‌రో వైపు బౌద్ధ మ‌త‌పెద్ద అతుర‌లియే ర‌త్న థేరో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ధ‌ర్నా చేప‌ట్టారు. ప్ర‌ఖ్యాత బౌద్ధ ఆల‌యం ముందు ఎంపీ అతుర‌లియే నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు. ముస్లిం వ‌ర్గానికి చెందిన మంత్రులు, గ‌వ‌ర్న‌ర్లు రాజీనామా చేయాల‌ని అతుర‌లియే డిమాండ్ చేస్తున్నారు.

5251
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles