క‌రెంటు తీగ‌లు కూలి.. 30 మంది ఫుట్‌బాల్ ప్రేక్ష‌కుల బలిFri,April 21, 2017 06:24 PM

Nigerian football fans electrocuted, 30 dead

క‌లాబార్ : నైజీరియాలో పెను విషాదం చోటుచేసుకున్న‌ది. టీవీలో ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షిస్తున్న ప్రేక్ష‌కుల‌పై హై టెన్ష‌న్ ఎల‌క్ట్రిక్ పోల్ కూలింది. ఈ ఘ‌ట‌న‌లో సుమారు 30 మంది మ‌ర‌ణించారని, మ‌రో 50 మంది తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు నైజీరియా న్యూస్ ఏజెన్సీ ఒక‌టి పేర్కొన్న‌ది. క‌లాబార్ ప‌ట్ట‌ణంలో ఈ దారుణం జ‌రిగింది. యూరోప్ లీగ్‌లో భాగంగా మాంచెస్ట‌ర్ యునైటెడ్‌, అండెర్‌లెచ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మ్యాచ్‌ను వీక్షిస్తున్న‌ప్పుడు ఈ ప్ర‌మాదం జ‌రిగింది. నైజీరియాలో సాధార‌ణంగా ఫుట్‌బాల్ మ్యాచ్‌ల‌ను ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన సెంట‌ర్ల‌లో పెద్ద పెద్ద స్క్రీన్ల‌పై వీక్షిస్తారు. ఆ సెంట‌ర్ల‌ను జింక్ రూఫింగ్ షీట్ల‌తో త‌యారుచేస్తారు. అయితే గురువారం స్థానికులు టీవీలో మ్యాచ్‌ను వీక్షిస్తున్న‌ప్పుడు అక‌స్మాత్తుగా సెంట‌ర్‌పై హైటెన్ష‌న్ క‌రెంటు తీగ‌లు కూలాయి. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు మాత్ర‌మే మ‌ర‌ణించార‌ని స్థానిక పోలీసులు చెప్పారు.

512
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS