నైజీరియన్ పాడిన 'కల్‌హోనాహో' టైటిల్‌ ట్రాక్‌కు ఫిదా అయిన నెటిజన్లు.. వీడియో

Mon,December 24, 2018 03:56 PM

Nigerian Fans Sing Kal Ho Naa Ho And Leave The Internet Stunned

సంగీతానికి బౌండరీలు ఉంటాయా? అస్సలు ఉండవు అని నిరూపించాడు ఈ నైజీరియన్. అవును.. 2003లో బాలీవుడ్‌లో వచ్చిన కల్ హో నా హో సినిమా గుర్తుందా మీకు. షారుక్ ఖాన్, ప్రీతి జింతా, సైఫ్ అలీ ఖాన్ లీడ్ రోల్స్ పోషించిన ఆ సినిమాలోని టైటిల్ ట్రాక్ అప్పట్లో ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. ఆ టైటిల్ ట్రాక్‌ను ఓ నైజీరియన్ పాడటం.. మరో ఇద్దరు నైజీరియన్లు ఆయనకు కోరస్ ఇవ్వడం.. ఆ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. నెటిజన్లు మాత్రం ఫిదా అయిపోయారు.

ఒరిజినల్ ట్రాక్‌ను బాలీవుడ్ సింగర్ సోను నిగమ్ పాడాడు. అచ్చం ఆయన గొంతులాగానే ఆ నైజీరియన్ కూడా పాడటం నెటిజన్ల‌ను మైమరిపింపజేసింది. దానికి సంబంధించిన వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే కాదు.. నెటిజన్లు ఆ పాటకు బ్రహ్మరథం పడుతున్నారు. కొంతమంది నెటిజన్లు మాత్రం సెటైర్లు కూడా వేస్తున్నారు. ఇండియన్స్ కన్నా నైజీరియన్సే బాలీవుడ్ మూవీస్‌ను ఎక్కువగా చూస్తారు.. అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. బౌండరీలు లేని మ్యూజిక్, ఇండియన్ ఐడల్ కంటెస్టెంట్ల కన్నా సూపర్బ్‌గా పాడాడు.. అంటూ ఇలా రకరకాల కామెంట్లతో ఆ వీడియోపై ప్రశంసల వర్షం కురిపించారు నెటిజన్లు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ నైజీరియన్లు పాడిన ఆ పాటను చూసేయండి మరి..
కల్‌హోనాహో ఒరిజినల్ పాట చూస్తారా?

1197
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles