ప్రపంచంలో మందు ఎక్కువగా ఎవరు తాగుతారో తెలుసా?

Fri,November 16, 2018 01:17 PM

New Study revealed that alcohol consumption linked to colder climates

న్యూయార్క్: ప్రతి ఒక్కరూ మందు పార్టీలు చేసుకోవడానికి ఏదో ఒక బహానా వెతుకుతుంటారు. బాధగా ఉందనో, సంతోషంగా ఉందనో, మరేదో సెలబ్రేషననో చెబుతుంటారు. కానీ ప్రపంచంలో ఆల్కహాల్ ఎక్కువగా ఎవరు తీసుకుంటారు? దీనికి కారణం ఏంటి అన్నదానిపై అమెరికాకు చెందిన ఓ రీసెర్చ్ కంపెనీ ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. యూనివర్సిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్ డివిజన్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నారు. వీళ్లు చివరిగా తేల్చింది ఏంటంటే.. ప్రపంచంలో అత్యంత చల్లగా, పగలు సమయం తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉన్న వాళ్లు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటారట. వీళ్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ దగ్గర ఉన్న 193 దేశాలు, అమెరికాలోని మొత్తం 50 రాష్ర్టాల్లోని 3144 కౌంటీల సమాచారాన్ని అధ్యయనం చేసి ఈ విషయాన్ని తేల్చడం విశేషం.

వాతావరణ పరిస్థితులు, ఆల్కహాల్‌కు మధ్య ఉన్న లింకుపై వీళ్లు పరిశోధనలు జరిపారు. సగటు ఉష్ణోగ్రతలు, పగటి సమయం, ఓ వ్యక్తి ఏడాదికి తీసుకునే ఆల్కహాల్ మొత్తం, జనాభాలో ఆల్కహాల్ తీసుకునే ప్రజల శాతాన్ని అంచనా వేసి ఫలితాలను విశ్లేషించారు. ఉష్ణోగ్రతలు, పగటి సమయం తక్కువగా ఉన్న సమయాల్లో ఆల్కహాల్ వినియోగం పెరిగిందని ఈ అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయన ఫలితాలను హెపటాలజీ జర్నల్‌లో పబ్లిష్ చేశారు. ప్రపంచంలోని దేశాలు, అమెరికాలోని రాష్ర్టాల మధ్య కూడా ఒకే రకమైన ఫలితాలు వచ్చాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అరబ్ దేశాల్లో ఆల్కహాల్ వినియోగం చాలా తక్కువగా ఉన్నట్లు కూడా గుర్తించారు. ఆల్కహాల్ వినియోగం పెరగడానికి, వాతావరణానికి కచ్చితంగా సంబంధం ఉందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

7792
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles