వీడియోలు: హెయిర్ టాటూ.. కొత్త ట్రెండ్ బాస్!

Fri,December 15, 2017 06:20 PM

new hairstyle hair tattoo videos goes viral

హెయిర్ టాటూ.. ఇప్పుడిదే ట్రెండు... క్లుప్తంగా చెప్పాలంటే కొత్త హెయిర్ స్ట‌యిల్‌. అయితే.. మీకు నచ్చిన ఎవరి ఫోటోనైనా మీ హెయిర్ స్ట‌యిల్‌గా మార్చుకోవచ్చు. అయితే... ఈ హెయిర్ స్ట‌యిల్‌ కావాలంటే మాత్రం మీరు తైవాన్ వెళ్లాల్సిందే. అల్లెన్ చెన్ అనే హెయిర్ స్ట‌యిలిస్ట్ మాత్రమే ఈ హెయిర్ స్ట‌యిల్‌ను వేయగలడు. చాలా మంది తమకు ఇష్టమైన వ్యక్తుల ఫోటోలను వాళ్ల హెయిర్ స్ట‌యిల్‌గా మార్చుకొని తెగ ఎంజాయ్ చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్, మోనాలిసా, అన్నాబెల్లే ఇలా తమకు ఇష్టమైన వారి ఫోటోలను నెత్తికెక్కించుకుంటున్నారు అభిమానులు. ఓ గంటలో మీకు కావాల్సిన వ్యక్తి ఫోటోతో మీ హెయిర్‌ను సెట్ చేస్తాడు అల్లెన్. ఈ కొత్త రకం హెయిర్ స్ట‌యిల్‌ను అల్లెనే కనిపెట్టాడట. అంతే కాదు.. దాని కోసం ఎంతో శ్రమించాడట. ఇప్పుడు ఈ సరికొత్త, భిన్నమైన హెయిర్ స్ట‌యిల్‌తో మనోడి గిరాకీ ఫుల్లుగా పెరిగిందట.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ హెయిర్ టాటూలపై ఓ లుక్కేయండి మరి...
2702
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS