టీటా సింగపూర్ శాఖకు నూతన కమిటీ

Thu,October 18, 2018 05:39 PM

New Committee for Telangana Information Technology Association Singapoore

సింగపూర్ : తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(టీటా) సింగపూర్ కమిటీ నూతన కార్యవర్గాన్ని గ్లోబల్ కమిటీ ఇవాళ ప్రకటించింది. తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరై.. టీటా సింగపూర్ శాఖకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలంగాణకు సంబంధించిన వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. టీటా సింగపూర్ శాఖ అధ్యక్షుడిగా సంతోష్ కళా, ఉపాధ్యక్షుడిగా రమేశ్ గడప, ప్రధాన కార్యదర్శిగా టీవీ కిషన్ రావు, సంయుక్త కార్యదర్శిగా భాస్కర్ నల్లా, కార్యనిర్వహణ కార్యదర్శిగా రాజేశ్ రెడ్డి, కోశాధికారిగా పల్లవి గర్రెపల్లి, కార్యనిర్వాహక సభ్యులుగా పుల్లా రమేశ్, శంకర్‌రెడ్డి దేవరపల్లిని టీటా గ్లోబల్ కమిటీ అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల ప్రకటించారు.

ఈ సందర్భంగా సందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ.. టీటా చేపడుతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలైన తెలంగాణ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా పెట్టుబడుల కల్పన, డిజిథాన్ ద్వారా అక్షరాస్యత, సహా ఇతర కార్యక్రమాలకు కొత్త బృందం తమ వంతు కృషి చేయాలని కోరారు.

ఇక టీటా సింగపూర్ శాఖ అధ్యక్షుడు సంతోష్ కళా మాట్లాడుతూ.. టీటా మార్గదర్శకాల మేరకు పని చేస్తూ టెకీలకు భరోసాగా ఉంటామన్నారు. టీటా ఆధ్వర్యంలో చేపడుతున్న డిజిథాన్, డిజిటల్ లిటరసీ సహా ఇతర కార్యక్రమాల్లో సింగపూర్ టెకీలు పాలుపంచుకునేలా తమ నూతన కమిటీ కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

922
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles