ప్రపంచ నిద్ర దినోత్సవం స్పెషల్.. హాయిగా ఎలా నిద్రపోవాలో చెబుతున్న నెటిజన్లు

Fri,March 15, 2019 03:44 PM

Netizens Share Their Secrets To A Good Night Sleep on world sleep day

ఇవాళ ప్రపంచ నిద్ర దినోత్సవం. అదేనండి.. వరల్డ్ స్లీప్ డే. ఇంగ్లీష్‌లో చెబితే గానీ మనకు అర్థం కాదు. ప్రతి సంవత్సరం వరల్డ్ స్లీప్ డేను వరల్డ్ స్లీప్ డే కమిటీ మార్చి 15న జరుపుతుంది. ఇది వరల్డ్ స్లీప్ సొసైటీకి అనుబంధంగా పనిచేస్తుంది. రాత్రి ప్రశాంతంగా ఎలా నిద్రపోవాలి.. నిద్రలేమి నుంచి ఎలా దూరమవ్వాలి.. లాంటి విషయాలపై అవగాహన పెంచేందుకు ప్రారంభమైందే ఈ సొసైటీ.

హాయిగా నిద్రపోతే వచ్చే లాభాలేంటో దాదాపు అందరికీ తెలుసు. హ్యాపీగా నిద్రపోయిన రోజు మనం చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాం. సరిగ్గా నిద్రపట్టని రోజు చిరాకు, ఒత్తిడి లాంటివి మనల్ని టెన్షన్ పెడుతుంటాయి. కంటినిండా నిద్రపోవడం వల్ల ఒత్తిడి తగ్గి.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోజు మూడ్ కూడా బాగుంటుంది. ఏ పని అయినా చకచకా చేసేస్తాం. నిద్రలేమి వల్ల గుండెకు సంబంధించిన జబ్బులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఇటీవలే పరిశోధకుల పరిశోధనలో నిద్రలేమి వల్ల మనిషిలోని డీఎన్‌ఏ డ్యామేజ్ అవుతుంద‌ని తేలింది.

అయితే.. ప్రశాంతంగా నిద్రపోవడం అనేది అంత ఈజీ కాదు. అది ఈరోజుల్లో అంటే కత్తి మీద సామే. మనల్ని డిస్టర్బ్ చేయడానికి స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు, గేమ్స్, వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటివి ఉన్నాక.. హాయిగా నిద్ర ఎలా పోతాం. నేటి యువత టెక్నాలజీకి బానిస అయి కంటినిండా నిద్రపోవడం కూడా మరిచిపోయిందట. దీంతో చిన్న వయసులోనే లేనిపోని సమస్యలను కోరి తెచ్చుకుంటోంది యువత.

అయితే.. ఈ అడ్డంకులన్నింటినీ అధిగమించి రాత్రి పూట కంటినిండా హాయిగా ఎలా నిద్రపోవాలో... కొంతమంది నెటిజన్లు సూచిస్తున్నారు. ఇవాళ ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా అయినా కనీసం నిద్ర ప్రాముఖ్యతను, కంటి నిండా నిద్ర ఎలా పోవాలో.. ఆ టెక్నిక్స్‌ను నేర్చుకుందాం పదండి.


కష్టపడి ఆ ట్వీట్లన్నీ చదివారా? చాలామంది నెటిజన్లు సూచించింది ఏంటో అర్థమయిందా? నిద్రకు ఉపక్రమించాక స్మార్ట్‌ఫోన్లతో ఆడటం, టీవీ చూడటం, గేమ్స్ ఆడటం పూర్తిగా మానేయాలి. రిలాక్స్ అయ్యే టెక్నిక్స్ పాటించాలి. మెడిటేషన్, పసందైన మ్యూజిక్ వినడం లాంటివి చేయాలి.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి.. ఆవేశ పడకూడదు.. అంటూ సూచించారు. అంతే కదా. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ వరల్డ్ స్లీప్ డే నుంచే హాయిగా నిద్రపోయేందుకు నెటిజన్లు సూచనలను పాటించండి మరి..

3239
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles