ముస్లిం వ్యతిరేక పోస్టులు పెట్టిన ఇజ్రేల్ ప్రధాని కుమారుడు

Tue,December 18, 2018 05:21 PM

ఇజ్రేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పెద్దకుమూరుడైన యైర్ నెతన్యాహూ పెట్టిన ముస్లిం వ్యతిరేక పోస్టులు ఫేస్‌బుక్ తొలగించింది. ఇజ్రేల్ నుంచి మొత్తం ముస్లింలంతా వెళ్లిపోవాలని అతడు పోస్టు పెట్టాడు. ఇజ్రేల్‌లో శాంతి కావాలంటే యూదులైనా వెళ్లిపోవాలి లేదా ముస్లింలైనా వెళ్లిపోవాలి.. ముస్లింలు వెళ్లిపోతే బాగుంటుందని నా అభిప్రాయం అని అందులో రాశాడు. దీంతో 24 గంటల పాటు యైర్ పేజీని ఫేస్‌బుక్ నిలిపివేసింది. ఆతర్వాత పోస్టును తొలగించింది. దీనిపై యైర్ మండిపడ్డాడు.


ఇది ఆలోచనలపై నిరంకుశత్వం తప్ప మరేమీ కాదని విమర్శించాడు. ఫేస్‌బుక్‌ను తిట్టడానికి అతడు ట్విటర్‌కు మళ్లడం గమనార్హం. భూమిమీద దాడులంటూ జరుగని దేశం ఏదైనా ఉందా? బహుశ ఐస్‌ల్యాండ్ లేదా జపాన్‌లో జరుగవేమో.. ఎందుకంటే అక్కడ ముస్లింలు అసలు లేరంటూ మళ్లీ అదేరకం పాట అందుకున్నాడు. ఈ వ్యవహారంపై ప్రధాని ప్రత్యర్థులు విమర్శలు సంధిస్తున్నారు.

ప్రధాని ఇంట్లో ఉంటూ యైర్ ఓ బాడీగార్డు, డ్రైవరు, ఇతర సౌకర్యాలు అనుభవిస్తున్నాడని వారంటున్నారు. వారసత్వ రాజకీయాలు నెలకొల్పేందుకు యైర్ తల్లిదండ్రులు అతడిని భావినేతగా తీర్చిదిద్దుతున్నట్టు ఉన్నదని వారు పేర్కొంటున్నారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ నేతృత్వంలోని లికుడ్ పార్టీ ఇజ్రేలీ యూదుల్లో తీవ్ర జాతీయవాదాన్ని ప్రేరేపిస్తుంది.

1825
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles