23వ సారి ఎవ‌రెస్టు ఎక్కిన నేపాలీ

Wed,May 15, 2019 12:13 PM

Nepal Mountaineer Kami Rita climbs Mount Everest for record 23rd time


హైద‌రాబాద్‌: నేపాల్‌కు చెందిన ప‌ర్వ‌తారోహ‌కుడు కామి రీటా రికార్డు సృష్టించాడు. అత్య‌ధిక‌సార్లు ఎవ‌రెస్ట్ శిఖ‌రాన్ని ఎక్కిన ప‌ర్వ‌తారోహ‌కుడిగా ఘ‌న‌త సాధించాడు. మౌంట్ ఎవ‌రెస్ట్‌ను అత‌ను 23 సార్లు ఎక్కాడు. ఎవ‌రెస్ట్ శిఖ‌రం వ‌ద్ద మార్చి నుంచి మే నెల‌లో ప‌ర్వ‌తారోహ‌కులు ఎక్కువ‌గా వ‌స్తుంటారు. అయితే ఈసారి అత‌ను నేపాల్ వైపు నుంచి ఎవ‌రెస్టును ఎక్కాడు. టిబెట్ నుంచి కూడా ఎవ‌రెస్ట్‌ను ఎక్క‌వ‌చ్చు. హిమాల‌యాల్లో నేపాల్ షెర్పాల‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న‌ది. షెర్పా తెగ ప్ర‌జ‌లు ప‌ర్వ‌తాల‌ను చాలా ఈజీగా ఎక్కేస్తారు. ఈసారి 8 మంది టీమ్‌తో క‌లిసి షెర్పా కామిరీటా ఎవ‌రెస్టును అధిరోహించాడు. నేపాల్ ప్ర‌భుత్వం ఈసారి మొత్తం 378 మందికి ఎవ‌రెస్టు ఎక్కేందుకు ప‌ర్మిష‌న్ ఇచ్చింది. ఒక్కొక్క‌రి నుంచి 11వేల డాల‌ర్లు వ‌సూల్ చేస్తోంది. అత్యంత ఎత్తైన శిఖ‌రం ఎవ‌రెస్టును ఈసారి నేపాల్ నుంచి సుమారు 750 మంది(షెర్పాల‌తో క‌లిపి) ఎక్కే అవ‌కాశాలు ఉన్నాయి. టిబెట్ నుంచి మ‌రో 150 మంది ప‌ర్వ‌తాన్ని ఎక్క‌నున్నారు.

499
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles