ఇండియా ఆ నీళ్లిస్తే ఎంత.. ఇవ్వకపోతే ఎంత: పాకిస్థాన్

Fri,February 22, 2019 01:32 PM

Neither concern nor objection says Pakistan on Gadkaris warning of water diverting

ఇస్లామాబాద్: సింధు నదీ జలాల ఒప్పందంలో భాగంగా మొత్తం ఆరు నదుల్లో మూడు నదులపై పాకిస్థాన్‌కు, మరో మూడు నదులపై ఇండియాకు హక్కులు ఉన్న సంగతి తెలుసు కదా. మూడు పశ్చిమ నదులు సింధు, జీలం, చీనాబ్‌లపై పాకిస్థాన్‌కు.. మూడు తూర్పు నదులు బియాస్, రావి, సట్లెజ్‌పై భారత్‌కు హక్కులున్నాయి. అయితే భారత్‌కు హక్కులున్న నదుల్లో మిగులు నీరు పాకిస్థాన్‌కు వెళ్తున్నది. పుల్వామా దాడి నేపథ్యంలో ఈ నదుల్లోని నీటిని పాకిస్థాన్‌కు వెళ్లకుండా అడ్డుకుంటామని, ఆ జలాలను జమ్ముకశ్మీర్ ప్రజలకు ఇస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరించారు. దీనిపై పాకిస్థాన్ స్పందించింది. తూర్పు నదుల్లోని నీటిని భారత్ ఇచ్చినా, ఇవ్వకపోయినా తమకు నష్టం లేదని స్పష్టం చేసింది. దీనిపై మాకు ఆందోళనగానీ, అభ్యంతరంగానీ ఏమీ లేదు. ఆ నదుల్లోని నీటిని అక్కడి ప్రజలకు ఇచ్చుకోవచ్చు. సింధూ నదీ జలాల ఒప్పందం అందుకు అనుమతి ఇచ్చింది అని పాకిస్థాన్ నీటి వనరుల శాఖ కార్యదర్శి ఖవాజా షుమాయిల్ స్పష్టం చేశారు. అయితే తమకు హక్కులున్న పశ్చిమ నదులు చీనాబ్, సింధు, జీలం నదుల్లోని నీటిని మళ్లిస్తే మాత్రం కచ్చితంగా తమ అభ్యంతరాలను లేవనెత్తుతామని ఆయన తెలిపారు.

5039
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles