పాక్ పీఎం ష‌రీఫ్‌, ముషార‌ఫ్ కొద్దిలో బ‌తికిపోయారు!

Mon,July 24, 2017 12:42 PM

Nawaz Sharif and Musharraf narrowly escaped during Kargil War says a Report

న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధం జ‌రిగిన సుమారు 18 ఏళ్ల త‌ర్వాత ఓ ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఆ యుద్ధ సంద‌ర్భంగా పీఎం న‌వాజ్ ష‌రీఫ్‌, మాజీ ఆర్మీ చీఫ్ ప‌ర్వేజ్ ముషార‌ఫ్ కొద్దిలో బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డారన్న‌ది ఆ వార్త‌. ద ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ ఈ ర‌హ‌స్యం ఉన్న అధికారిక నివేదిక‌ను సంపాదించింది. 1999, జూన్ 24న ఉద‌యం 8.45 గంట‌ల ప్రాంతంలో ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఫైట‌ర్ జెట్ జాగ్వార్‌.. గుల్టెరి బేస్‌పై దాడి చేయాల్సి ఉంది. ఈ జాగ్వార్ ఆ బేస్‌పై బాంబు విస‌రాల‌న్న‌ది ప్లాన్‌. అయితే చివ‌రి నిమిషంలో అదే బేస్‌లో ష‌రీఫ్‌, ముషార‌ఫ్ ఉన్నార‌న్న స‌మాచారంతో దాడి చేయ‌కుండా ఆ ఫైట‌ర్ జెట్ వెన‌క్కి వ‌చ్చేసిన‌ట్లు ఈ నివేదిక వెల్ల‌డించింది. ఆ బాంబును అక్క‌డ కాకుండా లైన్ ఆఫ్ కంట్రోల్ ద‌గ్గ‌ర ఉన్న భార‌త్ వైపు భూభాగంలో వేశారు. కార్గిల్ యుద్ధం సంద‌ర్భంగా ఈ గుల్టెరీ బేసే పాకిస్థాన్ ఆర్మీకి స‌రుకులు అందించేది. అయితే ఈ ఇద్ద‌రు నేత‌లు అదే రోజు తొలిసారి ఈ ఫార్వ‌ర్డ్ బేస్‌ల సంద‌ర్శ‌న‌కు రావ‌డంతో దానిపై బాంబు విస‌ర‌కూడ‌ద‌ని ఐఏఎఫ్ నిర్ణ‌యించిన‌ట్లు ఆ నివేదిక తెలిపింది.

1652
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles