కాసేపట్లో అరుణ గ్రహంపై దిగనున్న మార్స్ ఇన్‌సైట్.. వీడియో

Mon,November 26, 2018 04:35 PM

NASAs Mars InSight to land on Mars in a few more hours

హూస్టన్: అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ఊపిరి బిగపట్టుకొని వేచి చూస్తున్నది. ఏడు నెలల ప్రయాణం పూర్తి చేసుకొని మార్స్ ఇన్‌సైట్ కాసేపట్లోనే అరుణ గ్రహంపై కాలు మోపనుంది. ప్రస్తుతం గంటకు 14 వేల మైళ్ల వేగంతో వెళ్తున్న ఈ స్పేస్‌క్రాఫ్ట్.. అదే వేగంతో మార్స్ వాతావరణంలోకి ప్రవేశించనుంది. ఆ తర్వాత అది ల్యాండవడానికి కేవలం ఆరున్నర నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. వాతావరణంలోకి ఎంటరవడం, దిగడం, ల్యాండవడం ఈ సమయంలోనే చేయాల్సి ఉంటుంది. 77 మైళ్ల ఎత్తులో ఉన్నపుడు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ సమయంలోనే 14 వేల మైళ్ల వేగాన్ని గణనీయంగా తగ్గించి దానిని ల్యాండ్ చేయడమన్నది ఓ సవాలే. దీనికోసం 39 అడుగులు ఉన్న ప్యారాషూట్ తెరుచుకుంటుంది. ఆ తర్వాత హీట్ షీల్డ్, ల్యాండింగ్ లెగ్స్ తెరుచుకోవడంతోపాటు ల్యాండింగ్ సైట్ డేటా సేకరించడానికి రాడార్ సిగ్నల్స్‌ను యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది.


మార్స్‌పై ఉన్న ఇలీజియం ప్లానీషియాపై ఇన్‌సైట్ ల్యాండవనుంది. ఇది మైదాన ప్రాంతం. అరుణ గ్రహంపై అతిపెద్ద పార్కింగ్ ప్రాంతంగా నాసా దీనిని అభివర్ణించింది. మొత్తమ్మీద ఎనిమిది నిమిషాల వ్యవధిలో ఇన్‌సైట్ ల్యాండింగ్ కథేంటో తేలిపోతుంది. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఎప్పటికప్పుడు మార్స్‌పై సేకరించిన డేటాను భూమికి చేరవేయడానికి రెండు చిన్న క్యూబ్ శాటిలైట్స్ ఉన్నాయి. వీటిని క్యూబ్‌శాట్స్ అంటారు. మార్స్ నుంచి వేగంగా డేటా ట్రాన్స్‌ఫర్ కోసం తొలిసారి నాసా వీటిని పంపించింది. 2012లో క్యూరియాసిటీ రోవర్‌ను ల్యాండ్ చేసిన తర్వత ఇన్నాళ్లకు ఇన్‌సైట్‌ను కుజ గ్రహంపై దింపే ప్రయత్నం నాసా చేస్తున్నది. సౌర కుటుంబం ఏర్పడిన కొత్తలో ఈ మార్స్ ఎలా ఉండేదన్న సమాచారాన్ని ఇన్‌సైట్ పంపిన డేటా ఆధారంగా నాసా విశ్లేషించనుంది. జనవరి నుంచి ఈ సమాచారం భూమికి అందుతుంది.

2154
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles