నాసా క్యూబ్‌సాట్స్ తీసిన మార్స్ ఫొటో ఇదీ!

Tue,October 23, 2018 05:21 PM

NASAs CubeSats sends its first image of Mars

న్యూయార్క్: నాసాకు చెందిన క్యూబ్‌సాట్స్ తొలిసారి విశ్వాంతరాళంలో ప్రయాణిస్తూ ఓ ఫొటోను భూమికి చేరవేశాయి. ఇన్‌సైట్ మార్స్ ల్యాండర్‌తోపాటు రెండు మార్కో క్యూబ్‌సాట్స్ ప్రయాణిస్తున్నాయి. స్పేస్‌లో ఇవి మనుగడ సాగించగలవా లేదా అని నాసా పరిశీలిస్తున్నది. మార్కో-ఎ, మార్కో-బీ అనే ఈ రెండు క్యూబ్‌సాట్స్‌ను నాసా పంపించింది. ఇందులో మార్కో-బీపై ఉన్న కెమెరా కుజ గ్రహం (మార్స్) ఫొటోను తీసి భూమికి చేరవేసింది. ఈ ఫొటోను సుమారు కోటి 28 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి తీసినట్లు నాసా వెల్లడించింది. మార్కో-బీపై ఉన్న కెమెరా ఎక్స్‌పోజర్ సెట్టింగ్స్‌ను పరీక్షించడంలో భాగంగా ఈ ఫొటో తీసింది.


మార్స్‌కు దగ్గరవుతున్న కొద్దీ ఈ క్యూబ్‌సాట్స్ మరిన్ని ఫొటోలను పంపిస్తుందని నాసా తెలిపింది. నవంబర్ 26న అరుణ గ్రహంపై ఇన్‌సైట్ స్పేస్‌క్రాఫ్ట్ ల్యాండవడానికి ప్రయత్నించే సమయంలో ఈ క్యూబ్‌సాట్స్ కమ్యూనికేషన్స్ సామర్థ్యాన్ని నాసా పరీక్షించనుంది. ఒకరకంగా సూర్యుడి చుట్టూ తిరుగుతున్న మార్స్‌ను ఈ మార్కోస్ చేజ్ చేస్తున్నాయి. ఇన్‌సైట్ ల్యాండింగ్ సమయంలో సరైన స్థానంలో ఉండటానికి క్యూబ్‌సాట్స్ ఇంకా సుమారు 8.5 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇవి 39.9 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించాయి. క్యూబ్‌సాట్స్ పంపిన తాజా ఫొటోలో ఓ ఎర్రటి చుక్కగా అరుణ గ్రహం కనిపిస్తున్నది.

1558
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles