విక్ర‌మ్ ల్యాండ‌ర్ క‌నిపించింది.. ఫోటోలు రిలీజ్ చేసిన‌ నాసా

Tue,December 3, 2019 07:57 AM

ఫోటో సూచ‌న‌..
గ్రీన్ క‌ల‌ర్ డాట్స్‌.. విక్ర‌మ్ శిథిలాలు
బ్లూ క‌ల‌ర్ డాట్స్‌.. శిథిలాల వ‌ల్ల దెబ్బ‌తిన్న చంద్రుడి ఉప‌రిత‌లం


హైద‌రాబాద్‌: విక్ర‌మ్ ల్యాండ‌ర్ ఆచూకీ చిక్కింది. చంద్రుడి ఉప‌రిత‌లంపై ఉన్న విక్ర‌మ్ శిథిలాల‌ను నాసా గుర్తించింది. దానికి సంబంధించిన దృశ్యాల‌ను నాసా సంస్థ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది. చంద్ర‌యాన్‌2 ద్వారా విక్ర‌మ్ ల్యాండ‌ర్‌ను ప్ర‌యోగించిన విష‌యం తెలిసిందే. అయితే సెప్టెంబ‌ర్ 7వ తేదీన చంద్రుడిపై ల్యాండింగ్ స‌మ‌యంలో విక్ర‌మ్ అదుపు త‌ప్పింది. దాంతో ఆ ల్యాండ‌ర్ ఆచూకీ మిస్సైంది. అమెరికాకు చెందిన స్పేస్ ఏజెన్సీ నాసా.. ఇవాళ విక్ర‌మ్‌కు సంబంధించిన చిత్రాల‌ను రిలీజ్ చేసింది. లూనార్ రిక‌యిన‌సెన్స్ ఆర్బిటార్‌(ఎల్ఆర్‌వో) తీసిన ఫోటోల్లో విక్ర‌మ్ క‌నిపించింది. అది కూలిన ప్రాంతాన్ని నాసా ఆర్బిటార్ చిత్రీక‌రించింది. విక్ర‌మ్ శిథిలాలు అక్క‌డే ఉన్నాయి.


విక్ర‌మ్ శిథిలాల‌ను భార‌తీయ ఇంజినీర్‌ ష‌ణ్ముగ సుబ్ర‌మ‌ణియ‌న్ గుర్తించిన‌ట్లు నాసా చెప్పింది. విక్ర‌మ్ గ‌తిత‌ప్పిన వాయ‌వ్య ప్రాంతానికి 750 మీట‌ర్ల స‌మీపంలో విక్ర‌మ్ శిథిలాలు క‌నిపించాయి. ఎల్ఆర్‌వో తీసిన చిత్రాల‌ను.. ష‌ణ్ముగ స్ట‌డీ చేశారు. తాజాగా న‌వంబ‌ర్‌లో తీసిన ఫోటోల‌ను నాసా ఇంకా ప‌రిశీలిస్తున్న‌ది. అయితే విక్ర‌మ్ కూలిన ప్రాంతంలో మూడు పెద్ద పెద్ద శిథిలాల‌ను గుర్తించారు. ఫోటోల్లో ఆ శిథిలాల సైజు 2*2 పిక్సెల్స్‌గా ఉన్నాయి. విక్ర‌మ్ ప‌డిన ప్రాంతానికి సంబంధించిన రెండు ఫోటోల‌ను నాసా అప్‌డేట్ చేసింది. విక్ర‌మ్ కూల‌క‌ముందు, కూలిన త‌ర్వాత .. చంద్రుడి ఉప‌రిత‌లంపై జ‌రిగిన మార్పుల‌ను ఆ ఫోటోల్లో స్పష్టంగా చూడ‌వ‌చ్చు.

వాస్త‌వానికి చంద్రుడి ద‌క్షిణ ద్రువానికి 600 కిలోమీట‌ర్ల దూరంలో విక్ర‌మ్ సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సి ఉంది. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తు ల్యాండ‌ర్‌తో ఇస్రో సంకేతాల‌ను కోల్పోయింది. లూనార్ ఆర్బిటార్ సెప్టెంబ‌ర్ 17వ తేదీన ఫ‌స్ట్ మొజాయిక్ ఫోటోను రిలీజ్ చేసింది. కానీ ఆ ఫోటోలో విక్ర‌మ్ ఆచూకీ చిక్క‌లేదు. అయితే ఆ ఫోటోను డౌన్ లోడ్ చేసుకున్న శాస్త్ర‌వేత్త ష‌ణ్ముగ సుబ్ర‌మ‌ణియ‌న్‌కు విక్ర‌మ్ కూలిన ప్రాంతం క‌నిపించింది. ఆ త‌ర్వాత ఎల్ఆర్‌వో టీమ్‌తో ష‌ణ్ముగ త‌న డేటాను షేర్ చేశాడు. దీంతో నాసాకు చెందిన ఎల్ఆర్‌వో విక్ర‌మ్ ప‌డిన ప్రాంతాన్ని గుర్తించింది. అక్టోబ‌ర్ 14, 15, న‌వంబ‌ర్ 11 తేదీల్లో తీసిన ఫోటోల‌ను నాసా ఇమేజ్ సీక్వెన్స్ చేసింది. ఆ త‌ర్వాత న‌వంబ‌ర్‌లో తీసిన ఫోటోల‌తో బెస్ట్ పిక్సెల్ క్లారిటీ వ‌చ్చింది. దీంతో విక్ర‌మ్‌ను గుర్తించిన‌ట్లు నాసా వెల్ల‌డించింది.

4095
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles