నాసా అద్భుత సృష్టి.. హామర్ స్పేస్‌క్రాఫ్ట్!Tue,March 13, 2018 05:41 PM

నాసా అద్భుత సృష్టి.. హామర్ స్పేస్‌క్రాఫ్ట్!

హూస్టన్‌ః భూమికి విశ్వంలో నుంచి వచ్చే ఆస్టరాయిడ్స్‌తో ముప్పు పొంచి ఉన్న విషయం తెలిసిందే. గతంలోనూ చాలాసార్లు ఇవి భూమికి దగ్గరగా వచ్చాయి. వీటితో ఎప్పటికైనా ప్రమాదమేనని భావించిన నాసా శాస్త్రవేత్తలు ఓ అద్భుతమైన స్పేస్‌క్రాఫ్ట్‌ను సృష్టించారు. దీనిపేరు హామర్. ఇది భూమికి ముప్పు అనుకున్న ఆస్టరాయిడ్స్‌ను దూరంగా విసిరి కొడుతుంది. హామర్ అంటే.. హైపర్‌వెలాసిటీ మిటిగేషన్ మిషన్ ఫర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్. దీనిని నాసా, యూఎస్ నేషనల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్, యూఎస్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌లోని ఓ వెపన్స్ ల్యాబ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇది రెండు రకాలుగా ఆస్టరాయిడ్ల నుంచి భూమిని కాపాడుతుంది. అందులో మొదటిది ఈ స్పేస్‌క్రాఫ్ట్ ఆస్టరాయిడ్‌ను ఢీకొని దానిని దూరంగా విసిరేయడం. రెండోది తనలో ఉండే ఓ న్యూక్లియర్ వార్‌హెడ్‌ను పేల్చడం ద్వారా ఆ ఆస్టరాయిడ్‌ను ముక్కలుగా చేసేయడం. బెన్ను అనే భూమికి దగ్గరగా ఉన్న ఆస్టరాయిడ్‌ను దృష్టిలో ఉంచుకొని నాసా ఈ హామర్‌ను అభివృద్ధి చేసింది. ఈ బెన్ను ఆస్టరాయిడ్ ప్రతి ఆరేళ్లకోసారి భూమికి దగ్గరగా వస్తుంది. 2135లో ఇది భూమి, చంద్రుడికి మధ్య రానుంది. ఆ సమయంలో ఇది భూకక్షలో ప్రవేశించి పెను విధ్వంసం సృష్టించే ప్రమాదం కూడా ఉంది. అంతేకాదు నాసా మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పైనా పనిచేస్తున్నది. అది ఆస్టరాయిడ్లనే హైజాక్ చేసి వాటిని నియంత్రించగలిగే స్పేస్‌షిప్స్‌గా మార్చే ప్రాజెక్ట్ అది.

1250
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS