బీచ్‌కు కొట్టుకొచ్చిన వింత వస్తువు.. ఇంతకీ ఏంటది..!

Fri,October 12, 2018 06:26 PM

Mysterious Object Washes Up On Beach And Nobody Knows What It Is

ఆకాశం నుంచి ఊడి పడ్డ వింత వస్తువు, గ్రహాంతరవాసులు భూమ్మీద తిరుగుతున్నారు.. అంటూ మనం అప్పుడప్పుడు వార్తలు చూస్తూనే ఉంటాం. తాజాగా బీచ్‌కు ఓ వింత వస్తువు కొట్టుకొచ్చింది. సౌత్ కరోలినాలోని సీబ్రూక్ ఐలాండ్‌లో ఉన్న ఓ బీచ్‌కు భారీ ఆకారంలో ఉన్న ఓ వింత వస్తువు కొట్టుకొచ్చింది. అది ఎలా ఉంది అంటే.. మీరు పైన చూస్తున్నారుగా ఫోటో.. అదే. అది అసలు ఏంటో.. ఎక్కడి నుంచి వచ్చిందో.. పోనీ ఆకాశం నుంచి ఊడి సముద్రంలో పడి బీచ్‌కు కొట్టుకొచ్చిందా లేక.. సముద్రంలోని వస్తువా? అనేది మాత్రం తేల్చలేకపోతున్నారు.

దాన్ని ముందుగా లోకంట్రీ మరైన్ మామ్మల్ నెట్‌వర్క్ అనే సంస్థ దాన్ని గుర్తించింది. ఆ సంస్థ సముద్ర జీవుల రక్షణ కోసం పోరాడుతుంది. దాన్ని చూసి.. అరె.. వింతగా ఉందే అని దాని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు ఆ ఫోటోలను చూసి... తమ మెదడుకు పదును పెట్టి.. అవేంటో కనుక్కునే పనిలో పడ్డారు. కానీ.. వాళ్ల జుట్టు మాత్రం ఊడి వచ్చింది కానీ.. అది ఏంటో మాత్రం నెటిజన్లు కూడా తేల్చలేకపోయారు.

ఇక.. ఆ ఫోటో కాస్త వైరల్‌గా మారడంతో.. దాన్ని సీబ్రూక్ ఐలాండ్ అధికారులు అక్కడి నుంచి తరలించారు. దానికి పరీక్షలు చేస్తున్నారు. స్థూపాకారంలో ఉన్న ఆ వస్తువు మాత్రం ఏంటో ఇప్పటి వరకు ఎవరూ తేల్చలేకపోతున్నారు. కొన్ని రోజుల తర్వాత అదే సౌత్ కరోలినాలోని ఇంకో ఐలాండ్ కియావాహ్‌లో మరో మిస్టీరియస్ ఆబ్జెక్ బయటపడింది. అది కూడా వింతగా ఉండటంతో మామ్మల్ నెట్‌వర్క్ దాని ఫోటో తీసి తమ సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో షేర్ చేశారు. అయితే.. సీబ్రూక్ ఐలాండ్‌లో కొట్టుకొచ్చిన వింత వస్తువు సగభాగం ఇదే అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

12956
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles