ఆరు వ‌రుస పేలుళ్లు.. 66 మందికి గాయాలు

Mon,August 19, 2019 04:31 PM

multiple blasts in Jalalabad city,  66 injured



హైద‌రాబాద్‌: ఆఫ్ఘ‌నిస్తాన్‌లోని జ‌లాలాబాద్‌లో ఇవాళ ఆరు చోట్ల పేలుళ్లు జ‌రిగాయి. రెస్టారెంట్లు, ప‌బ్లిక్ ప్రాంతాల్లో ఆ ఘ‌ట‌నలు చేసుకున్నాయి. ఆ పేలుళ్ల‌లో సుమారు 66 మంది పౌరులు గాయ‌ప‌డ్డారు. బ్రిటీష్ పాల‌న నుంచి స్వాత్రంత్య్రం పొంది వందేళ్లు అయిన నేప‌థ్యంలో ఇవాళ ఆఫ్ఘ‌నిస్తాన్‌లో వేడుక‌లు జ‌రుగుతున్నాయి. అయితే నాన్‌ఘ‌ర్ ప్రావిన్సులోని జ‌లాలాబాద్ సిటీలో ఇవాళ ఆరు ప్రాంతాల్లో పేలుడు ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. ఐడీ ఈవెంట్ల‌ను టార్గెట్ చేస్తూ జ‌రిగిన పేలుళ్ల‌లో 34 మంది గాయ‌ప‌డిన‌ట్లు గ‌వ‌ర్న‌ర్ షా మొహ‌బూద్ చెప్పారు. ఈ దాడుల‌కు బాధ్య‌త ఎవ‌రూ ప్ర‌క‌టించుకోలేదు. రెండు రోజుల క్రిత‌మే కాబూల్‌లో ఓ పెళ్లి వేడుక‌లో జ‌రిగిన ఆత్మాహుతి దాడిలో సుమారు 63 మంది మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఇండిపెండెన్స్ డే ప్ర‌సంగంలో అధ్య‌క్షుడు అష్ర‌ఫ్ ఘ‌నీ ప్ర‌పంచ దేశాల సాయాన్ని కోరారు. మిలిటెంట్ల ఏరివేత‌కు అంత‌ర్జాతీయ దేశాలు స‌హ‌క‌రించాల‌న్నారు. ఐఎస్‌కు సంబంధించిన ద‌యిస్‌ను త‌రిమేందుకు పోరాటం చేస్తామ‌న్నారు.

1521
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles