Telangana Intermediate 1st & 2nd Year Results 2019

9.5 కోట్ల లాటరీ గెలిచి.. ముఖాన్ని దాచుకుంది!

Fri,June 8, 2018 06:40 PM

Multi million lottery winner shows up in emoji mask to hide identity in Jamaica

కోట్లలో లాటరీ గెలవాలంటే మనకు టన్నుల కొద్దీ లక్కు ఉండాలి. అదే లేకపోతే ఏం చేసినా ఫలితం ఉండదు. ఇక.. ఒక్కసారి కోట్ల విలువైన లాటరీ గెలిచాక ఎవరైనా ఎలా ఉంటారు. వాళ్ల ఆనందానికి హద్దులే ఉండవు. ఓవర్ నైట్ సెలబ్రిటీలు అయిపోతారు. కాని.. ఓ మహిళ మాత్రం 9.5 కోట్ల రూపాయల లాటరీ గెలిచినా.. తన ముఖాన్ని మాత్రం ఎవరికీ చూపించలేదు. తన ఐడెంటిటీ తెలియకుండా ముఖానికి ఎమోజీ మాస్క్‌ను తలిగించుకున్నది. ఈ ఘటన జమైకాలో చోటు చేసుకున్నది.




జమైకాకు చెందిన మహిళ ఎన్ గ్రేకు సూపర్ లోటో జాక్‌పాట్‌లో 180 మిలియన్ జమైకన్ డాలర్ల విలువైన లాటరీ తలిగింది. అంటే మన కరెన్సీలో 9.5 కోట్ల రూపాయలు అన్నమాట. ఇక.. లాటరీ చెక్కును ఇవ్వడానికి గ్రేను లాటరీ నిర్వాహకులు పిలిచారు. కాని.. తను మాత్రం తన ముఖాన్ని చూపించకుండా వింక్ వింక్ ఎమోజీ మాస్క్‌ను వేసుకొని అక్కడికి వెళ్లింది. దీంతో లాటరీ నిర్వాహకులు నోరెళ్లబెట్టారట. ఇక.. మాస్క్ వేసుకొని ఉన్న ఆ మహిళ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ సూపర్ మిలియనీర్ ఉమెన్ గురించే సోషల్ మీడియాలో చర్చ.



"నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ప్రస్తుతం అప్పుల్లో కూరుకుపోయాను. అందుకే గత జనవరి నుంచి సూపర్ లోటోలో లాటరీ టికెట్లు కొనడం ప్రారంభించాను. లాటరీ ద్వారా గెలిచిన డబ్బులతో నా అప్పులు మొత్తం తీర్చేస్తాను. తర్వాత ట్రావెలింగ్ చేయాలనుంది. మిగిలిన డబ్బుతో మా కమ్యూనిటీకి చెందిన యువకుల కోసం కమ్యూనిటీ సెంటర్‌ను నిర్మించాలని అనుకుంటున్నాను. దాని ద్వారా వాళ్లకు ఏదైనా ఉపాధి కల్పించాలనుకుంటున్నాను.." అంటూ గ్రే వెల్లడించింది.







"లాటరీ గెలుపొందిన వాళ్ల ఐడెంటిటీ తెలిస్తే వాళ్ల సొమ్ము దొంగలించబడే అవకాశం ఉంది. వాళ్లకు ప్రాణ హాని కూడా ఉంటుంది. అందుకే చాలామంది లాటరీ గెలిచిన వాళ్లు తమ ఐడెంటిటీని దాచుకుంటున్నారు.." అంటూ లాటరీ కంపెనీ నిర్వాహకులు తెలిపారు.

గత సంవత్సరం ఫిబ్రవరిలో ఇలాగే యూఎస్‌లో 560 మిలియన్ డాలర్ల లాటరీ సాధించిన ఓ మహిళ తన ఐడెంటిటీ తెలపకుండా లాటరీ డబ్బులను తీసుకుంటానని, దానికి పర్మిషన్ కావాలని కోర్టుకు విన్నవించుకుంది.

7377
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles