వచ్చే ఆదివారం రాబర్ట్ ముగాబే అంత్యక్రియలు !

Sun,September 8, 2019 02:03 PM

Mugabe to be buried next Sunday quoted media


హరారే: జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే అంత్యక్రియలు వచ్చే ఆదివారం జరిగే అవకాశమున్నట్లు అక్కడి మీడియా ఓ ప్రకటనలో వెల్లడించింది. రాబర్ట్ ముగాబే భౌతికకాయం బుధవారం జింబాబ్వేకు రానున్నట్లు తెలుస్తోంది. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాబర్ట్ ముగాబే (95) సింగపూర్‌లోని ఆస్పత్రిలో గత శుక్రవారం కన్నుమూసిన విషయం తెలిసిందే.

1980లో జింబాబ్వేలో బ్రిటీష్ వలసవాదం ముగిసినప్పటి నుంచి ముగాబే 37 ఏళ్లుగా అధికారంలో కొనసాగారు. 2017 నవంబర్ 21వ తేదీన ఆర్మీ తిరుగుబాటు చేసి అధికార పగ్గాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ముగాబేకు వ్యతిరేకంగా రాజీనామా కోరుతూ దేశవ్యాప్తంగా ప్రజలు సామూహిక నిరసన ప్రదర్శనలు చేశారు. 93 ఏళ్ల వయసులో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న దేశాధ్యక్షుడిగా ముగాబె రికార్డు సృష్టించారు.

1211
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles