మోన్‌సాంటో కంపెనీకి భారీ జరిమానా

Sat,August 11, 2018 07:44 AM

Monsanto ordered to pay $289m damages in a cancer trial

కాలిఫోర్నియా: మోన్‌సాంటో కంపెనీపై అమెరికా కోర్టు భారీ జరిమానా వేసింది. నష్టపరిహారం కింద సుమారు 289 మిలియన్ల డాలర్లు చెల్లించాలంటూ ఓ కేసులో ఆ కంపెనీని ఆదేశించింది. మోన్‌సాంటో కంపెనీకి చెందిన పురుగుల మందులను పంటలకు వాడడం వల్ల క్యాన్సర్ వచ్చినట్లు ఓ బాధితుడు కోర్టులో కేసు వేశాడు. హెర్బిసైడ్‌లో ఉన్న ైగ్లెపాస్పేట్ వల్ల క్యాన్సర్ వచ్చినట్లు అతను కోర్టులో ఫిర్యాదు చేశాడు. మోన్‌సాంటో కంపెనీకి చెందిన రౌండప్, రేంజర్‌ప్రో క్రిమినాశక మందుల్లో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సికో కోర్టు తేల్చింది. అయితే ఆ మందులు వాడే కస్టమర్లకు .. మోన్‌సాంటో కంపెనీ ఎటువంటి హెచ్చరికలు చేయలేదని కోర్టు అభిప్రాయపడింది. ైగ్లెపాస్పేట్ వల్ల క్యాన్సర్ వస్తుందని కోర్టులో కేసు దాఖలు కావడం ఇదే తొలిసారి. అయితే మోన్‌సాంటో కంపెనీ మాత్రం ఆ వాదనను కొట్టిపారేస్తున్నది. ైగ్లెపాస్పేట్ వల్ల క్యాన్సర్ రాదు అని కంపెనీ పేర్కొన్నది.

1402
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles