టూరిస్ట్‌ పర్స్ లాక్కున్న‌ కోతి.. అందులో ఉన్న క్యాష్‌ను ఏం చేసిందంటే.. వీడియో

Sat,February 17, 2018 05:05 PM

Monkey Snatches Tourist Wallet and throws away all the cash in china

ఓ కోతికి కొబ్బరి చిప్ప కాదు.. ఏకంగా డబ్బులు ఉన్న పర్సే దొరికింది. సారీ.. కొట్టేసింది. దాంట్లో బోలెడు డబ్బులు కూడా ఉన్నాయి. మరి.. పర్స్‌ను దొంగలించిన కోతి.. అందులో ఉన్న క్యాష్‌ను ఏం చేసిందో తెలుసా? పదండి.. తెలుసుకుందాం.

అది చైనా, సిచువాన్ ప్రావిన్స్‌లోని మౌంట్ ఎమెయ్. అక్కడే ఓ పాపులర్ టూరిస్ట్ స్పాట్ ఉంది. మన దేశంలో ఎక్కడ చూసినా కోతులు ఎలా ఉంటాయో... చైనాలోనూ అంతే. ఆ టూరిస్ట్ ప్లేస్‌లో కోతుల బెడద ఎక్కువే ఉంటుందట. అయితే.. టూరిస్ట్ స్పాట్‌లో ఎంజాయ్ చేద్దామని వచ్చిన ఓ వ్యక్తికి మాత్రం చేదు అనుభవం ఎదురైంది. ఆ వ్యక్తి వ్యాలెట్‌ను ఓ కొంటె కోతి ఎత్తుకెళ్లింది. అంతటితో ఆగకుండా... రెయిలింగ్ మీద కూర్చొని అందరు చూస్తుండగానే పర్స్‌ను ఓపెన్ చేసింది. పర్స్‌ను పరికించి ఓ చూపు చూసిన తర్వాత దాంట్లో ఉన్న డబ్బులను తీసి చెత్త కాగితాన్ని పడేసినట్లు పడేసింది. అనంతరం ఆ పర్స్‌ను కూడా అక్కడే పడేసి అక్కడి నుంచి తుర్రుమన్నది. ఇంతలోనే అక్కడికి వచ్చిన మరో కోతి ఆ ఖాళీ పర్సును తీసుకొని అటు ఇటూ ఊపి చూసింది. ఈ ఘటననంతా అక్కడికి వచ్చిన టూరిస్టులు చూస్తూ ఉండిపోయారు. పర్స్ పోగొట్టుకున్న వ్యక్తి మాత్రం బావురుమంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక.. ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డవడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలయింది.

6326
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS