యూఎస్ ఆర్మీలో భార‌తీయుడు.. జీతం కోటి!

Tue,May 9, 2017 02:26 PM

Monark Sharma from Jaipur joined in US Army

జైపూర్‌: భార‌త సంత‌తికి చెందిన వ్య‌క్తి యూఎస్ ఆర్మీలో చేరారు. జైపూర్‌కు చెందిన మోనార్క్ శ‌ర్మ అనే వ్య‌క్తికి యూఎస్ ఆర్మీకి చెందిన ఏహెచ్‌-64ఈ కంబాట్ ఫైట‌ర్ హెలికాప్ట‌ర్ యూనిట్‌లో సైంటిస్ట్‌గా ఉద్యోగం వ‌చ్చింది. ఏడాదికి అత‌ని జీతం రూ.1.2 కోట్లు కావ‌డం విశేషం. ఈ ఏడాది యూఎస్ ఆర్మీలో చేరిన ఫైట‌ర్ హెలికాప్ట‌ర్ల డిజైన్‌, ప‌ర్య‌వేక్ష‌ణ‌, త‌య‌రీ, నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లను మోనార్క్ చూసుకోవాల్సి ఉంటుంది. 2013లో నాసాలోని మాస్ క‌మ్యూనికేష‌న్ వింగ్‌లో మోనార్క్ శ‌ర్మ జూనియ‌ర్ రీసెర్చ్ సైంటిస్ట్‌గా త‌న కెరీర్ ప్రారంభించాడు. ఆ త‌ర్వాత మే 2016లో యూఎస్ ఆర్మీలో చేరాడు. కాప్ట‌ర్ల డిజైనింగ్‌, ప‌రిశోధ‌న‌లో త‌న మార్క్ చూపిన మోనార్క్‌.. ఈ ఏడాది కాలంలో రెండు ప్ర‌తిష్టాత్మ‌క ఆర్మీ అవార్డులు కూడా అందుకున్నాడు. మోనార్క్ శ‌ర్మ జైపూర్‌లోని నేష‌న‌ల్ యూనివ‌ర్సిటీ నుంచి ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్స్‌లో బ్యాచిల‌ర్ డిగ్రీ చేశాడు. అత‌ని తండ్రి ఓ ప్ర‌భుత్వ ఉద్యోగి. నిజానికి ఇండియ‌న్ ఆర్మీకి తాను సేవ‌లు చేయాల‌ని భావించినా అది కుద‌ర‌లేద‌ని, యూఎస్ ఆర్మీలో ఆ ప‌ని చేసి ఇండియాకు పేరుప్ర‌తిష్ట‌లు తీసుకురావాల‌ని భావిస్తున్న‌ట్లు శ‌ర్మ చెప్పాడు.

1728
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles