మొన్న బ్లూవేల్.. నిన్న కికి.. నేడు మొమో చాలెంజ్..!

Wed,August 8, 2018 03:48 PM

Momo challenge now trends online

ఇదంతా స్మార్ట్‌ఫోన్ యుగం. నేటి యువత ఎక్కువగా ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్ అంటూ వాటితోనే గడిపేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లలోనే ఏదో చేసేయాలన్న తపన వాళ్లది. దాన్ని క్యాష్ చేసుకోవాలని కొంతమంది హ్యాకర్స్ యువతను రకరకాలుగా ఆకర్షిస్తుంటారు. వాళ్లతో గేమ్స్ ఆడుకుంటారు. ఆ ముసుగులో వాళ్లకు కావాల్సిన డేటాను లాక్కుంటారు. ఆకర్షితులైన వారిని బలిపశువులను చేస్తారు. ఆ నేపథ్యంలో వచ్చిందే బ్లూ వేల్ చాలెంజ్. దాని బారిన పడి ఎంతో మంది పిల్లలు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. దాని తర్వాత కూడా చాలా చాలెంజులు వచ్చినా మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చింది మాత్రం కికి చాలెంజ్. తాజాగా సోషల్ మీడియాలో నానుతున్నది మాత్రం మొమో చాలెంజ్.

అవును.. ఇప్పుడు సోషల్ మీడియాలో మొమో చాలెంజ్‌పైనే చర్చ. ఇది కూడా చాలా ప్రమాదకరమైన చాలెంజే. కాని.. టీనేజర్లు, విద్యార్థులు దీనికి బాగా ఆకర్షితులవుతున్నారు. రీసెంట్‌గా అర్జెంటినాకు చెందిన 12 ఏండ్ల అమ్మాయి ఈ చాలెంజ్ బారిన పడి తన ప్రాణాలను కోల్పోయిన‌ట్లు అనుమానిస్తున్నారు.

అసలేంటి ఈ మొమో చాలెంజ్..


మొమో అనేది ఓ సోషల్ మీడియా అకౌంట్. వాట్సప్, ఫేస్ బుక్, యూట్యూబ్‌లో మొమో అకౌంట్లు ఉంటాయి. కొన్ని ఆర్ట్ వర్క్స్‌తో యూజర్లను వీళ్లు భయపెడుతుంటారు. ఇక.. కొంతమంది యూజర్లను ఆకర్షించి వాళ్లకు కొన్ని ఆర్డర్స్ వేస్తారు. కొంతమంది తెలియని వాళ్ల నెంబర్స్ ఇచ్చి వాళ్లతో మాట్లాడాలని ఒత్తిడి తెస్తారు. ఒకవేళ యూజర్లు నిరాకరిస్తే వాళ్ల అకౌంట్లకు భయంకరమైన ఫోటోలు పంపించి భయపెడుతుంటారు. ఈ చాలెంజ్ వెనుక పెద్ద తతంతగమే ఉందని.. యూజర్ల డేటాను తస్కరించడానికే క్రిమినల్స్ ఇటువంటి కుయుక్తులకు పాల్పడుతుంటారని కొంతమంది సోషల్ మీడియా ఎక్స్‌పర్ట్‌లు అభిప్రాయపడుతున్నారు. ఇక.. ఈ చాలెంజ్ సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే లేపుతున్నది. నెటిజన్లు కూడా ఈ చాలెంజ్ గురించి తమదైన శైలిలో స్పందించారు.2082
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS