బిడ్డ ఏడ్వకుండా ఉండేందుకు తల్లి వినూత్న ప్రయోగం.. వీడియో

Sat,December 14, 2019 12:15 PM

పిల్లలు తాము పుట్టినప్పటి నుంచి మొదలుకొని సుమారు రెండేండ్ల వరకు తల్లిని విడిచిపెట్టి ఉండలేరు. తండ్రి కనిపించకపోయినా సరే.. అంతగా ఆందోళన చెందరు. కానీ తల్లి కనిపించకపోతే గుక్కపట్టి ఏడుస్తుంటారు. తల్లి అలా వారి ముందు ప్రత్యక్షమైతే చాలు.. క్షణాల్లో ఏడుపు ఆపేస్తారు. తల్లి, పిల్లల మధ్య అంతటి అనుబంధం ఉంటుంది. అయితే ఓ తల్లి మాత్రం తాను లేకపోయినప్పటికీ.. తన బిడ్డ ఏడ్వకుండా ఉండేందుకు ఓ వినూత్న ప్రయోగం అమలు చేసింది.


జపాన్‌కు చెందిన ఓ మహిళకు ఏడాదిన్నర బాలుడు ఉన్నాడు. ఆ పిల్లాడు తల్లిని విడిచి అసలు ఉండలేడు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు ఓ సరికొత్త ప్రయోగం అమలు చేశారు. తల్లిని పోలిన రెండు కటౌట్లకు ఆర్డర్ చేశారు. ఒక కటౌట్ ఏమో తల్లి నిలబడి ఉన్నట్లు, మరొకటేమో కూర్చున్నట్లు తయారు చేయించారు. ఇక కూర్చొన్న కటౌట్‌ను హాల్‌లో, నిలబడి ఉన్న కటౌట్‌ను కిచెన్‌లో పెట్టి తల్లి వేరే పనులు చేసుకునేందుకు బయటకు వెళ్తుంది. అవి కటౌట్లు అని తెలియని బాలుడు.. నిజంగా అమ్మ అక్కడే ఉందని సంతోషపడుతూ తన బొమ్మలతో ఆడుకుంటున్నాడు. ఒక 20 నిమిషాల వరకు ఆ బిడ్డ తన తల్లిని కటౌట్ల రూపంలో చూసి మురిసిపోతున్నాడు. అమ్మ తన వద్దే ఉందని బాలుడు ఫీలవుతూ తన ఆటలో నిమగ్నమైపోతున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక గత నెలలో ఓ అమ్మాయి తన తల్లి కోసం గుక్క పట్టి ఏడుస్తుంటే.. తండ్రి తెలివిగా ఏం చేశాడంటే.. భార్య ముఖాన్ని పోలిన మాస్క్‌ను ధరించాడు. ఆ తర్వాత ఆమె డ్రస్సు ధరించాడు. దీంతో ఆ అమ్మాయి.. అమ్మ తన వద్దే ఉందనుకుని ఏడ్వడం మానేసి హాయిగా నిద్ర పోయింది.

ఇంకో తండ్రి చేసిన పనిని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. చంటి బిడ్డ పాల కోసం ఏడుస్తుంది. తల్లేమో ఇంట్లో లేదు. దీంతో అతను పాల బాటిల్‌ను తల్లి ఫీడింగ్ ఇచ్చినట్లుగా టీ షర్ట్ లోపల పెట్టుకున్నాడు. ఆ పాలను తాగుతూ బిడ్డ ఏడుపు మానేసింది.


6635
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles