మాల్దీవుల అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న మోదీ

Sat,November 17, 2018 07:41 PM

Modi attends Maldives Prez Solihs swearing-in ceremony

మాలే: మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఇబ్రహీం మహ్మద్ సోలీ ప్రమాణ స్వీకారోత్సవానికి భారత ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. మాలేలోని నేష‌న‌ల్ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఇబ్రహీం ఇవాళ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన విదేశీ నేతలు, ప్రతినిధులతో మోదీ ముచ్చటించారు. మాల్దీవుల్లో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి తెరపడి ఎట్టకేలకు అధ్యక్ష ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.

సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో అబ్దుల్లా యమీన్‌పై ఇబ్రహీం గెలుపొందాడు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాల్దీవుల్లో మోదీకి ఇదే తొలి పర్యటన. సోలీ అధికారికంగా బాధ్యతలు చేపట్టిన త‌రువాత ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అంతకుముందు 2011లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ దేశంలో పర్యటించారు.1120
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles