ర్యాంప్ వాక్ చేస్తూ బిడ్డకు పాలిచ్చిన మోడల్.. వైరల్ వీడియో

Tue,July 17, 2018 05:44 PM

Model Mara Martin walks on the ramp while feeding her baby

మియామీ: ఈ మోడల్ ప్రపంచానికి ఓ వినూత్న సందేశాన్నిచ్చింది. ర్యాంప్ వాక్ చేస్తున్న సమయంలోనే తన ఐదు నెలల బిడ్డకు పాలిచ్చింది మోడల్ మారా మార్టిన్. స్పోర్ట్స్ ఇల్యుస్ట్రేటెట్ మ్యాగజైన్ నిర్వహిస్తున్న వార్షిక స్విమ్ సూట్ ర్యాంప్ వాక్‌లో భాగంగా మారా ఇలా బిడ్డకు పాలిచ్చి అమ్మతనాన్ని చాటి చెప్పింది. ఈ షో 16 మంది ఫైనలిస్ట్‌లలో మారా కూడా ఒకరు. గోల్డ్ కలర్ టూ పీస్ బికినీలో క్యాట్‌వాక్ చేసిన మారా.. ఆ సమయంలో తన ఐదు నెలల బిడ్డ ఆరియాకు పాలివ్వడం అక్కడున్న వాళ్లందరి దృష్టిని ఆకర్షించింది. ఆమెకు మద్దతుగా అక్కడున్న వాళ్లంతా పెద్ద ఎత్తున చప్పట్లతో అభినందించారు. సదరు మ్యాగజైన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. దీంతో ఆమెపై అభినందనల వర్షం కురిపిస్తూ కామెంట్స్ సెక్షన్ నిండిపోయింది. ఆ మోడల్ కూడా తాను బిడ్డతో ర్యాంప్ వాక్ చేస్తున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేసుకుంది. బిడ్డతో కలిసి ర్యాంప్ వాక్ చేసినందుకు ఈ స్థాయిలో స్పందన వస్తుందని తాను ఊహించలేదని మారా చెప్పింది.

4646
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles