స‌బ్‌మెరైన్‌లో ఇంట‌ర్వ్యూకు వెళ్లి.. శ‌వ‌మైన మ‌హిళా జ‌ర్న‌లిస్టు..

Mon,August 21, 2017 05:51 PM

Missing journalist Kim Wall died in submarine accident

కోపెన్‌హెగ‌న్: ఓ మ‌హిళా జ‌ర్న‌లిస్టు ఇంట‌ర్వ్యూ కోసం స‌బ్‌మెరైన్‌లోకి వెళ్లింది. కొన్ని గంట‌ల త‌ర్వాత ఆ స‌బ్‌మెరైన్ నీటిలో మునిగిపోయింది. కానీ ఆమె జాడ ఇంకా తెలియ‌రాలేదు. స‌బ్‌మెరైన్ ఓన‌ర్ మాత్రం బ్ర‌తికి బ‌య‌ట‌ప‌డ్డాడు. ఆగ‌స్టు 10న డెన్మార్క్‌లో జ‌రిగిన సంఘట‌న ఇప్పుడు సంచ‌ల‌న రేపుతున్న‌ది. కిమ్ వాల్ అనే మ‌హిళా జ‌ర్న‌లిస్టు అంత‌ర్జాతీయ మీడియాకు వార్త‌లు రాస్తుంది. దానిలో భాగంగానే ఓ ప్రైవేటు వ్య‌క్తి నిర్మించిన జ‌తాంత‌ర్గామి గురించి ఇంట‌ర్వ్యూ చేసేందుకు అక్క‌డ‌కు వెళ్లింది. యూసీ3 అనే స‌బ్‌మెరైన్‌ను పీట‌ర్ మాడ్స‌న్ నిర్మించారు. రెండు ల‌క్ష‌ల డాల‌ర్ల విరాళాలు సేక‌రించి ఆయ‌న ఆ జ‌లాంత‌ర్గామిని డెవ‌ల‌ప్ చేశాడు. అయితే ఆగ‌స్టు 10వ తేదీన కిమ్ వాల్‌, పీట‌ర్ మాడ్స‌న్‌లు స‌బ్‌మెరైన్‌లో విహ‌రించారు. కానీ స‌బ్‌మెరైన్‌కు ప్ర‌మాదం జ‌రిగింది. అది స‌ముద్రంలో మునిగిపోయింది. దాని ఓన‌ర్ పీట‌ర్ మాత్రం ప్రాణాల‌తో బ‌య‌ట‌కు వ‌చ్చాడు. కానీ జ‌ర్న‌లిస్టు కిమ్ వాల్ ఆచూకీ చిక్క‌లేదు. ప‌ది రోజులైనా ఆమె జాడ క‌న‌బ‌డ‌లేదు. దీంతో పీట‌ర్‌ను అరెస్టు చేసిన డెన్మార్క్ పోలీసులు అత‌న్ని ర‌హ‌స్యంగా విచారించారు. అయితే స‌బ్‌మెరైన్ ప్ర‌మాదంలో కిమ్ వాల్ చ‌నిపోయింద‌ని, ఆమె మృత‌దేహాన్ని స‌ముద్రంలో ప‌డేసిన‌ట్లు మాడ్స‌న్ చెప్పాడు. దీంతో కోపెన్‌హెగ‌న్ పోలీసులు అత‌నిపై కేసు న‌మోదు చేశారు. జ‌ర్న‌లిస్టు మృత‌దేహాం కోసం పోలీసులు కోపెన్ న‌దిలో వెతుకుతున్నారు.

2680
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles