36-24-36 కొలతలు కాదు.. వేధింపుల లెక్కలు!Wed,November 1, 2017 01:52 PM
36-24-36 కొలతలు కాదు..  వేధింపుల లెక్కలు!

సాధారణంగా ఏదో ఒక దేశానికి అందగత్తెలను ఎలా సెలెక్ట్ చేసుకుంటారు. అందం, ఫిట్‌నెస్, కొలతలు, ప్రతిభా పాఠవాలు, సోషల్ సర్వీస్ లాంటి ఎన్నింటినో పరిగణనలోకి తీసుకొని వాళ్లను వాళ్ల దేశానికే ఆ సంవత్సరానికి అందగత్తెలంటూ ప్రకటిస్తారు. కాని.. సౌత్ అమెరికాలోని పెరులో జరిగిన మిస్ పెరు పోటీలు మాత్రం ఈ సారి కాస్త భిన్నంగా జరిగాయి.

మిస్ పెరులో పాల్గొన్న కంటెస్టెంట్లు.. వాళ్ల కొలతలు, అందాలు, ఫిట్‌నెస్, సర్వీసుల గురించి చెప్పి తమను తాము పొగుడుకోలేదు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల్లో ప్రమాదకరమైన దేశాల జాబితాలో ఉన్న సౌత్ అమెరికాలో.. మహిళలపై జరుగుతున్న దాడులపై స్పందించారు.

మిస్ పెరు పోటీలో ఫైనల్‌కు చేరుకున్న 23 మంది ఫైనలిస్టులు సౌత్ అమెరికాలో ఎంతమంది మహిళలు ఎలా దాడులకు గురవుతున్నారో.. రోజు ఎంతమంది వేధింపులకు గురవుతున్నారో లెక్కలతో సహా చెప్పి శెభాష్ అనిపించుకున్నారు.

"నాపేరు కమిలా కనికొబా.. నేను లిమాను రిప్రజెంట్ చేస్తున్నాను.. నా కొలతలు వచ్చేసి.. నా దేశంలో గత 9 ఏండ్ల నుంచి మహిళలు, అమ్మాయిలను మగాళ్లు చంపిన కేసులు 2202 నమోదయ్యాయి" అంటూ ఫైనలిస్టుల్లో ఒకరైన కమిలా ఇలా చెప్పుకొచ్చింది.

"81 శాతం యువతులపై దాడులు, అత్యాచారాలు చేసేది కుటుంబ సభ్యుల్లో ఒకరు లేదా తెలిసిన వాళ్లే" అంటూ తన కొలతలను చెప్పుకొచ్చింది మరో ఫైనలిస్టు.

"ప్రతి పది నిమిషాలకు అత్యాచారం వల్ల ఓ అమ్మాయి తన ప్రాణాలు కోల్పోతున్నది.." అంటూ మరో ఫైనలిస్టు చెప్పింది.పెరుకు చెందిన 70 శాతం మంది మహిళలు రోడ్డు మీద అఘాయిత్యానికి గురవుతున్నారని ఇంకో ఫైనలిస్టు.. ఇలా ప్రతి ఒక్కరు ఇలా సౌత్ అమెరికాలో మహిళలు, అమ్మాయిలపై జరుగుతున్న దాడులను కండ్లకు కట్టినట్లు వివరించారు.

"మహిళలపై దాడులు చేసే కీచకుల వివరాలను సేకరించి వాళ్ల వివరాలతో ఓ డేటాబేస్‌ను రూపొందించి వాళ్లందరికీ శిక్ష పడేలా చేయగల్గితే మరో మగాడు తప్పు చేయడానికి బయపడతాడు" అంటూ చెప్పుకొచ్చింది.. కల్లావోను రిప్రజెంట్ చేస్తున్న రొమినా లొజానో. అయితే.. రొమినాకే జడ్జిలు కూడా ఓటేసి తనను మిస్ పెరు 2017 గా ప్రకటించారు.

5699
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS