ఇది నిజమా.. భ్రాంతా? డైమండ్‌ కదులుతోందా? మీ కళ్లను మీరే నమ్మలేరు..!

Fri,June 7, 2019 05:02 PM

Mind blowing Optical Illusion on diamond shape moving

ఆప్టికల్‌ ఇల్యూజన్‌ అంటే తెలుసు కదా. ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడం. మన కంటికి కనబడేది నిజం కాదు. కానీ.. అదే నిజం అనుకుంటాం. మన కళ్లను మనమే మోసం చేసుకోవడం. ఆప్టికల్‌ ఇల్యూజన్‌ మీద సోషల్‌ మీడియాలో వందల కొద్ది పోస్టులు రోజూ షేర్‌ అవుతూనే ఉంటాయి. కానీ.. తాజాగా ఆప్టికల్‌ ఇల్యూజన్‌ మీద షేర్‌ అయిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాను హల్‌ చల్‌ చేస్తోంది.

అదేంటంటే ఓ డైమండ్‌ షేప్‌ దాన్నే పెర్పెచువల్‌ డైమండ్‌ అంటారు. అంటే దానికి ఓ ముగింపు ఉండదు అన్నమాట. ఊదా రంగులో ఉన్న డైమండ్‌ షేప్‌.. గ్రే బ్యాక్‌ గ్రౌండ్‌తో అటూ ఇటూ మూవ్‌ అవుతుంది. స్క్రీన్‌పై అది అటూ ఇటూ కదులుతున్నట్టు అనిపిస్తుంది. లెఫ్ట్‌ వైపు క్లిక్‌ చేయగానే ఎడమవైపుకు.. రైట్‌ క్లిక్‌ చేయగానే కుడి వైపు.. అప్‌ పై క్లిక్‌ చేయగానే పైకి.. డౌన్‌ క్లిక్‌ చేయగానే కిందికి కదులుతున్నట్టు అని కనిపిస్తుంది. కానీ.. అది నిజంగా కదలదు. ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది. కానీ.. మనకు మాత్రం అది కిందికీ.. మీదికీ.. పక్కకు.. జరుగుతున్నట్టు అనిపిస్తుంది. దాన్నే ఆప్టికల్‌ ఇల్యూజన్‌ అని అంటారు.

దీన్ని ఓ వ్యక్తి తన ట్విట్టర్‌ అకౌంట్‌లో షేర్‌ చేశాడు. దాన్ని వాషింగ్టన్‌ డీసీలోని అమెరికన్‌ యూనివర్సిటీకి చెందిన కొందరు పరిశోధకులు సృష్టించారు. ఇప్పుడు నెటిజన్లంతా వాళ్ల మెదడుకు పదును పెట్టి మరీ.. దాన్ని పరికించి చూసి నిజంగా అది కదులుతుందా లేదా అని చెక్‌ చేస్తున్నారు.
4146
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles