మాతృత్వాన్ని చాటుకున్న మహిళా బస్ డ్రైవర్.. వీడియో

Fri,January 11, 2019 05:23 PM

ఓ మహిళా బస్ డ్రైవర్ మాతృత్వాన్ని చాటుకుంది. ఏడాది బాలుడు ఎముకలు కొరికే చలిలో ఫుట్ పాత్ పై నడుచుకుంటూ వెళ్తున్నాడు. చిన్నారి నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యం మహిళా డ్రైవర్ ఇరేనా లివిక్ కంట పడింది. తక్షణమే ఆమె బస్సును ఆపి చిన్నారి వద్దకు పరుగెత్తి తన చేతుల్లోకి తీసుకుంది. అనంతరం బాలుడిని తన క్యాబిన్ లోకి తీసుకువచ్చిన మహిళా డ్రైవర్ అమ్మలా మారి ఒడిలో పడుకోబెట్టుకుంది. బస్సులో ఉన్న మరో మహిళ తన జాకెట్ ను ఇచ్చి చలి తీవ్రత నుంచి బాలుడిని కాపాడారు. ఈ సంఘటన యూఎస్ లోని మిల్ వాకీ పట్టణంలో డిసెంబర్ లో చోటు చేసుకోగా గురువారం వెలుగు చూసింది.


ఈ సందర్భంగా మహిళా డ్రైవర్ మాట్లాడుతూ.. బాబు పాదాలకు కనీసం షూ లేవు. చల్లటి చలి ఉంది. చిన్నారి పరుగెడుతున్న తీరు చూస్తే బాధ కలిగించింది. తక్షణమే బస్సును ఆపి బాబును ఒడిలోకి తీసుకున్నాను అని ఇరేనా లివిక్ చెప్పింది. బాలుడిని ప్రభుత్వ అధికారులకు అప్పగించారు. అయితే బాలుడి తల్లిదండ్రులు వారి మానసిక స్థితి సరిగ్గా లేక అతడిని రోడ్డుపై వదిలి వెళ్లిపోవాలి. లేదా చర్చికి వచ్చిన పేరేంట్స్ బాలుడిని మరిచిపోయి అయినా ఉండాలి అని అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి చిన్నారిని కాపాడిన ఇరేనా లివిక్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.



3094
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles