స్పెయిన్‌కు పెరుగుతున్న ఆఫ్రికా శ‌ర‌ణార్థుల తాకిడి

Thu,August 17, 2017 10:48 AM

Migrant crisis: Spain rescues 600 people in busiest day

మాడ్రిడ్: ఆఫ్రికా నుంచి అక్ర‌మంగా స్పెయిన్‌కు వ‌ల‌స వ‌స్తున్న శ‌ర‌ణార్థుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న‌ది. మొరాక్కో నుంచి గ‌త 24 గంట‌ల్లో సుమారు 600 మంది స్పెయిన్ చేరుకున్న‌ట్లు తెలుస్తున్న‌ది. పెడ‌ల్ బోట్ల ద్వారా కూడా శ‌ర‌ణార్థులు వ‌స్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. తాజాగా 15 వెస‌ల్‌ బోట్ల‌లో వెళ్తోన్న వ‌ల‌స‌దారుల‌ను కోస్టుగార్డులు ప‌ట్టుకున్నారు. ఈ ఏడాది స్పెయిన్‌కు ఇప్ప‌టికే 9000 మంది వ‌ల‌స వ‌చ్చిన‌ట్లు తెలుస్తున్న‌ది. స‌ముద్రం దాట‌బోయి సుమారు 120 మంది చ‌నిపోయిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. శ‌ర‌ణార్థుల సంఖ్య పెరుగుతున్న తీరు చూస్తే, గ్రీస్‌ను స్పెయిన్ దాటే అవ‌కాశాలున్నాయి అనుమానిస్తున్నారు. 12 కిలోమీట‌ర్ల దూరం ఉన్న జీబ్రాల్ట‌ర్ సంధి మార్గం ద్వారా శ‌ర‌ణార్థులు వ‌ల‌స వెళ్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది.

978
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles