చిక్కుల్లో ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిపై అభిశంసన !

Wed,August 22, 2018 05:58 PM

Michael Cohen Says he arranged payments to women at Trumps direction

మన్‌హటన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను సెక్స్ స్కాండల్ వెంటాడుతోంది. 2016లో దేశాధ్యక్ష ఎన్నికల ప్రచారానికి ముందు ఇద్దరు పోర్న్ స్టార్లకు ట్రంప్ డబ్బులు ఇప్పించారని మాజీ లాయర్ మైఖేల్ కోహెన్ తెలిపారు. మన్‌హటన్ కోర్టులో విచారణకు హాజరైన ట్రంప్ మాజీ లాయర్.. ఈ విషయాన్ని వెల్లడించారు. పోర్న్ స్టార్ స్టార్మీ డానియల్స్, ప్లేబాయ్ మాడల్ కరేన్ మెక్‌డౌగల్.. ఎన్నికల ప్రచారానికి ముందు నోరు విప్పకుండా ఉండేందుకు ట్రంప్ అక్రమంగా తన చేత డబ్బులు ఇప్పించారని కోర్టులో కోహెన్ తెలిపారు. క్యాంపేన్ ఫైనాన్స్ చట్టాలకు వ్యతిరేకంగా అక్రమంగా ఆ డబ్బులను ముట్టచెప్పినట్లు ట్రంప్ మాజీ లాయర్ నేరాన్ని అంగీకరించారు. దేశాధ్యక్ష హోదాకు పోటీపడుతున్న వ్యక్తి ఇచ్చిన ఆదేశాల మేరకు ఇద్దరు మహిళలకు డబ్బులు ఇచ్చినట్లు లాయర్ కోహెన్ మన్‌హటన్ జిల్లా కోర్టు ముందు తెలిపారు. అమెరికా ఎన్నిక‌ల్లో ర‌ష్యా ప్ర‌మేయం ఉంద‌న్న అంశంపై కూడా తాను ర‌హ‌స్య స‌మాచారాన్ని వెల్ల‌డించ‌నున్న‌ట్లు కోహెన్ చెప్పారు.

అయితే ఈ కేసు వల్ల ట్రంప్ తన దేశాధ్యక్ష పదవిని కోల్పోతాడా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ లీగల్ నిపుణులు మాత్రం అలాంటిది ఏమీ ఉండదన్నారు. ట్రంప్‌పై క్రిమినల్ కేసు కూడా నమోదు కాదన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ కేసు ఆధారంగా ట్రంప్‌ను అభిశంసించడం అంత సులువైంది కాదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ట్రంప్ నేరం రుజువైతే ముందు ఆయన్ను కాంగ్రెస్ నుంచి తప్పించాల్సి ఉంటుంది. కానీ అలా జరగాలంటే, ముందుగా రెండు సభల్లోనూ ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ పట్టు సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు స్వీప్ చేసినా.. వాళ్లు రిపబ్లికన్లపై వత్తిడి తేవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ప్రెసిడెంట్‌పై అభిశంసన ప్రక్రియ జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో దేశాధ్యక్షులపై అభిశంసన జరగలేదు.

3207
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles