రెండేండ్లుగా ఏసీ ట్రక్కుల్లోనే వందల శవాలు

Thu,September 20, 2018 04:28 PM

mexico faces peoples ire over mobile mortuaries

మెక్సికోలో హత్యలు ఎక్కువ. ప్రపంచంలో సిరియా తర్వాత రెండో స్థానంలో ఉంది. రోజుకు సగటున 69 హత్యలు జరుగుతాయని ఓ అధ్యయనంలో తేలింది. ప్రతి లక్షమందికి 16.3 హత్యలు జరుగుతాయి. (ఈ విషయంలో ప్రథమ స్థానంలో ఉన్న ఎల్‌సాల్వడార్‌లో లక్షమందికి 108.64 మంది హత్యకు గురవుతారు). పశ్చిమ మెక్సికోలోని జాలిస్కో రాష్ట్రంలో హత్యల రేటు మరీ అధికంగా ఉంటుంది. డ్రగ్స్, ఆయుధాల అక్రమరవాణా మాఫియాలే ఈ హత్యలకు ప్రధాన కారణం. దీనివల్ల మెక్సికోకు ఓ విచిత్రమైన సమస్య ఎదురవుతున్నది. చనిపోయినవారి శవాలను దాచేందుకు మార్చురీలు దొరకడంలేదు. ఉన్న మార్చురీల్లో సామర్థ్యానికి మించి శవాలను భద్ర పరుస్తున్నారు. అయినా కుప్పలుతెప్పలుగా ప్రతిరోజూ శవాలు వస్తుండడంతో ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. దీంతో ఏసీ ట్రక్కులు సంపాదించి వాటిలో శవాలను భద్రపరుస్తున్నారు. గత రెండేళ్లుగా ఈ సంచార మార్చురీల వ్యవస్థ నడుస్తున్నది. ప్రస్తుతం ఇవి ప్రజల ఆగ్రహానికి గురవుతున్నాయి. జాలిస్కో రాష్ట్ర రాజధాని గ్వాదలజారా నగరంలో ఈ సంచార మార్చురీలను ఎక్కడపడితే అక్కడ నిలుపుతున్నారు. వాటిల్లోంచి భయంకరమైన దుర్గంధం వస్తుండడంతో ప్రజలు మండిపడుతున్నారు. తమ బస్తీలకు సమీపంలో నిలిపేందురకు అనుమతించడం లేదు. మృతుల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా ఇలా బస్తీలలో శవాలను తిప్పడంపై మెక్సికో జాతీయ మానవహక్కుల కమిషన్ మండిపడుతున్నది. ఇటీవల ఓ మార్చురీ ట్రక్కును గోదాము దగ్గర నిలిపారు. వాసన వ్యాపించి, ఈగలు జొబ్బుమనడంతో స్థానికులు ఫిర్యాదు చేశారు. దాంతో అధికారులు దానిని మరో పేదల బస్తీకి తరలించారు. గత శనివారం అక్కడివారు కూడా నిరసన తెలుపడంతో నగరం నడిబొడ్డులోని దర్యాప్తు విభాగం గోదాం వద్దకు తెచ్చిపెట్టారు. ఇంతకూ ఆ ట్రక్కులో ఎన్ని శవాలున్నాయని అడిగితే అధికారులు మొదట 157 అని సమాధానమిచ్చారు. తర్వాత ఆ సంఖ్య 273కు చేరుకుంది. శవాల గదులను ఏర్పాటు చేయడంలో విఫలమైనందుకు జాలిస్కో రాష్ట్ర మార్చురీ అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేశారు. మరి హత్యలు ఆపలేకపోయినందుకు పోలీసు అధికారులను సస్పెండ్ చేయరా? అని ప్రజలు నిలదీస్తున్నారు.

6563
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles